సంగీత్ శోభన్ నటించిన “ప్రేమ విమానం” మూవీ చూశారా..? ఎలా ఉందంటే..?

సంగీత్ శోభన్ నటించిన “ప్రేమ విమానం” మూవీ చూశారా..? ఎలా ఉందంటే..?

by kavitha

Ads

హీరో సంగీత్ శోభన్ ఇటీవల మ్యాడ్ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సంగీత్ శోభన్ హీరోగా నటించిన ‘ప్రేమ విమానం’ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ అభిషేక్ నామా ఈ సినిమాని నిర్మించారు.

Video Advertisement

యాంకర్ మరియు నటి అనసూయ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘జీ 5’ లో నేరుగా విడుదల అయ్యింది. నేటి నుండే ఈ మూవీ స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. ప్రేమ విమానం సినిమాలో సంగీత్ శోభన్, శాన్వీ మేఘన జంటగా నటించారు. అనసూయ భరద్వాజ్,  ‘వెన్నెల’ కిశోర్, అనిరుధ్ నామా, దేవాన్ష్ నామా ఇతర పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, రెండు గ్రామాలలో 1990 బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. ఒక గ్రామంలో శాంతమ్మ(అనసూయ) తన భర్త నాగరాజు(రవివర్మ), పిల్లలు రామ్‌ (దేవాన్ష్‌ నామా) లక్ష్మణ్‌ అలియాస్‌ లచ్చు (అనిరుథ్‌ నామా)లతో కలిసి చిన్న గుడిసెలో జీవిస్తూ ఉంటుంది. అప్పులతో వారి కుటుంబం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది.
అయితే శాంతమ్మ చిన్న కొడుకు లచ్చుకు విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది. తన కోరికను తండ్రికి చెబితే, నాగరాజు పంట చేతికివచ్చిన తర్వాత విమానం ఎక్కిస్తాను అని చెప్తాడు. కానీ కొన్నిరోజులకే అప్పుల బాధ తట్టుకోలేక  ఉరేసుకొని చనిపోతాడు. శాంతమ్మ కూలి పనులు చేస్తూ, పిల్లలను పోషించుకుంటుంది. ఇంకో గ్రామంలో మణి (సంగీత్ శోభన్) తండ్రి (గోపరాజు రమణ)తో కలిసి కిరాణా కొట్టు నడుపుతూ జీవిస్తుంటారు. మణి ఆ గ్రామ సర్పంచ్ కూతురు అభిత (శాన్వీ మేఘన)ను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఇద్దరు తమ పెళ్ళికి పెద్దవాళ్ళు ఒప్పుకోరని లేచిపోతారు. ఈ క్రమంలో ఈ జంట ఎలాంటి ఇబ్బందులు పడుతుంది? విమానం ఎక్కాలనే కోరికతో శాంతమ్మ పిల్లలు ఏం చేశారు? చివరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ.

Also Read: ముందు ఏమో అలా… తరువాత ఇలా..! “సప్త సాగరాలు దాటి” మూవీలో ఇది గమనించారా..?

 

 


End of Article

You may also like