Home Sports Adda సానియా మీర్జా సంవత్సరానికి ఎంత సంపాదిస్తారో తెలుసా..! ఆమె ఆస్తి విలువ ఎంతంటే.?

సానియా మీర్జా సంవత్సరానికి ఎంత సంపాదిస్తారో తెలుసా..! ఆమె ఆస్తి విలువ ఎంతంటే.?

by Mohana Priya

ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఎన్నో టోర్నమెంట్లలో గెలిచి భారత దేశం గర్వించదగ్గ ప్లేయర్స్ లో ఒకరిగా నిలిచారు సానియా మీర్జా. అయితే సానియా మీర్జా ఇటీవల ఒక కీలక ప్రకటన చేశారు.

ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ ఓడిపోయిన తర్వాత సానియా మాట్లాడుతూ, కొద్ది రోజులుగా మోకాలు నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఆస్ట్రేలియా ఓపెన్ ఓడిపోవడానికి ఇవే కారణాలు అని చెప్పాలని అనుకోవట్లేదు అని, అలా అని కెరీర్ ని కొనసాగించలేను అని, ఇప్పుడు తన వయసు 35 సంవత్సరాలు అని, ఈ సీజన్ విజయవంతంగా ముగించడం తన లక్ష్యం అని చెప్పారు సానియా మీర్జా.

sania mirza total net worth

2003లో ప్రొఫెషనల్ గా టెన్నిస్ ఆడటం మొదలుపెట్టారు సానియా మీర్జా. ఆ తర్వాత సానియా మూడు సార్లు మహిళల మిక్స్‌డ్‌ డబుల్స్ టైటిల్స్ గెలిచారు. ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్రకారం ఇప్పటివరకు సానియా దాదాపు 53 కోట్లు గెలిచారు. సానియా మీర్జా హైదరాబాద్ లో ఒక విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంటి ధర దాదాపు 13 కోట్ల వరకు ఉంటుంది. ఆ ఇంటిని సానియా మీర్జా 2012లో కొనుగోలు చేశారు.

sania mirza total net worth

దుబాయ్ లో కూడా సానియాకి ఒక విలాసవంతమైన బంగ్లా ఉంది. స్పోర్ట్స్ ద్వారా సంవత్సరానికి దాదాపు 3 కోట్లు సంపాదిస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా 25 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు. సానియా ఆస్తి విలువ దాదాపు 184 కోట్ల వరకు ఉంటుంది అని సమాచారం. సానియా మీర్జాకి చాలా పెద్ద కార్ కలెక్షన్ కూడా ఉంది. ఎన్నో పాపులర్ బ్రాండ్ లకి చెందిన కార్లన్నీ సానియా కొనుక్కున్నారు.

You may also like