sara tendulkar:SRH vs MI మ్యాచ్ చూస్తున్న సారా.. ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది.. మీరు గమనించారా..?

sara tendulkar:SRH vs MI మ్యాచ్ చూస్తున్న సారా.. ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది.. మీరు గమనించారా..?

by Sunku Sravan

Ads

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై టీంకు ఓపెనరుగా వచ్చిన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ చక్కటి శుభారంభం చేశారు. ఈ తరుణంలో కంబ్యాక్ చేసిన హైదరాబాద్ బౌలర్లు ఓపెనర్ల తో పాటుగా సామ్స్, తిలక్ వర్మ వికెట్లు తీసి ముంబై జట్టును ఒత్తిడిలోకి పంపారు. అయితే క్రీజులోకి దిగిన సింగపూర్ పవర్ హీట్టర్ టీం డేవిడ్ మాత్రం సుడిగాలీ లాంటి ఇన్నింగ్స్ తో ఒక్కసారి హైదరాబాద్ కు చుక్కలు చూపించాడు. నటరాజ్ వేసిన టువంటి 18వ ఓవర్లో హట్రిక్ సిక్సర్ల తో సహా మొత్తం 26 పరుగులు చేశాడు.

Video Advertisement

ఇక ఆరో బంతికి తొందరపడి రన్ అవుట్ అయిపోయాడు. డేవిడ్ అవుట్ అవ్వడంతో జీర్ణించుకోలేని సారా టెండూల్కర్ చాలా బాధ పడి పోయింది. మొహానికి అడ్డంగా చేతులు పెట్టుకొని నో అన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 193 పరుగులు చేసింది.

ఇందులో రాహుల్ త్రిపాఠి (44/76, 9 ఫోర్లు 3 సిక్సర్లు ), నికోలస్ (22 బంతుల్లో 38, 2 ఫోర్లు 3 సిక్సర్లు ): ప్రియం గార్గ్ ( 26 బంతుల్లో42, 4 ఫోర్లు,2 సిక్సర్లు ) రాణించారు. దీంతో ముంబై జట్టు ముందు హైదరాబాద్ టీం పోరాడే స్కోరును ఉంచగలిగింది. ఇక ముంబై బౌలర్లలో రామన్ దీప్ సింగ్ 3 వికెట్లు తీశారు. చేదనలో ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లు190 పరుగులు చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది.


End of Article

You may also like