ఓవరాక్షన్ చేయకు కాస్త తగ్గించుకో అంటూ.. హార్థిక్ పాండ్యాకు క్లాస్.. చివరికి..?

ఓవరాక్షన్ చేయకు కాస్త తగ్గించుకో అంటూ.. హార్థిక్ పాండ్యాకు క్లాస్.. చివరికి..?

by Sunku Sravan

Ads

ఎలాంటి అంచనాలు లేకుండానే ఈ ఐపీఎల్ సీజన్ ని మొదలుపెట్టిన గుజరాత్ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో మొదటి స్థానంలో ఉన్నది.. ఇప్పటివరకు 20 పాయింట్లను సాధించి ఎవరికి కూడా అందనంత ఎత్తులో రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి ప్రధానంగా ఆర్థిక్ పాండ్యా కెప్టెన్సీ కూడా కారణం అని చెప్పవచ్చు. హార్థిక్ పాండ్యా 2015లో ముంబై ఇండియన్స్ జట్టు తరుపున క్యాష్ రీచ్ లీగ్ ఐపీఎల్ లో అడుగు పెట్టాడు. చాలా తక్కువ సమయంలోనే ఆల్ రౌండర్ గా మంచి పేరు తెచ్చుకొని టీమ్ ఇండియా తలుపు తట్టాడని చెప్పవచ్చు.

Video Advertisement

ఏడు సంవత్సరాల పాటు ముంబై జట్టులో ఆడిన హార్దిక్ పాండ్యా .. కానీ ఈ ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ తరపున కెప్టెన్ గా మారిపోయారు. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గుజరాత్ ఈసారి ప్లే ఆప్స్ అర్హత సాధించిన మొదటి జట్టుగా రికార్డు కొట్టింది.. దీనికంతటికీ పాండ్యా కష్టం చాలా ఉందని చెప్పవచ్చు.. ఇదంతా బాగానే ఉన్నా, పాండ్యా మైదానంలోకి వచ్చాడంటే చాలా దూకుడుగా ఉంటాడు.

చిన్న చిన్న విషయాల్లో కూడా కాస్త ఓవర్ గానే బిహేవ్ చేస్తాడు. ఆయన కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాక చాలా వరకు కూల్ అండ్ కామ్ గానే కనిపించారు. అయితే హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో బౌండరీ దగ్గరలో ఫీల్డింగ్ చేస్తున్నటువంటి మహమ్మద్ షమిని దారుణంగా బూతులు తిడుతూ కోపాన్ని బయటపెట్టారు పాండ్య. సీనియర్ ప్లేయర్ అని కూడా చూడలేదు. దీనివల్ల పాండ్య చాలా విమర్శల పాలయ్యాడు.

ఈ సంఘటన తర్వాత పాండ్యా కు షమీ సలహా ఇచ్చారు ” ప్రపంచమంతా క్రికెట్ చూస్తుంది.. ఇందులో మీ పిల్లలు కూడా ఉన్నారు. నీ కోపాన్ని కాస్త కంట్రోల్ లో పెట్టుకో ” అంటూ శమీ అన్నారు. కెప్టెన్ గా ఉన్న వ్యక్తి హుందాగా వ్యవహరించడం చాలా అవసరం. ఒక్కొక్క కెప్టెన్ కు ఒక్కో విధమైన స్పెషాలిటీ ఉంటుంది . ధోని చాలా కూల్ గా మిస్టర్ కూల్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇందులో కోహ్లీ అగ్రెసివ్.. రోహిత్ శర్మ సమయాన్ని బట్టి మ్యాచ్ ను నడిపిస్తారు.. కాబట్టి పాండ్యా మైండ్ సెట్ ని అర్థం చేసుకోవడం “నాకేమీ రాకెట్ సైన్స్ “కాదని బదులిచ్చారు షమి..


End of Article

You may also like