అంపైర్ మాట కూడా వినకుండా ఓవర్ మధ్యలో “జడ్డు” కావాలనే అలా చేసాడా..? “పంత్” తో రోహిత్ పంపిన సీక్రెట్ మెసేజ్ ఏంటి..?

అంపైర్ మాట కూడా వినకుండా ఓవర్ మధ్యలో “జడ్డు” కావాలనే అలా చేసాడా..? “పంత్” తో రోహిత్ పంపిన సీక్రెట్ మెసేజ్ ఏంటి..?

by Anudeep

Ads

2022 ఆసియా కప్‌లో తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది. మహ్మద్ నవాజ్ నుండి భారీ సిక్సర్ బాదిన హార్దిక్ పాండ్యా ఒక ఫ్లాట్ డెలివరీ తో విజయవంతమైన పరుగు సాధించాడు. భారత ఆల్-రౌండర్ 33* పరుగులతో విజృంభించాడు. కేవలం 17 బంతుల తో టీమ్ ఇండియా కు అవసరమైన విజయం సాధించడంలో సహాయ పడ్డాడు. జడేజా చివరి ఓవర్‌లో 35 పరుగులతో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు.

Video Advertisement

ఇది ఇలా ఉండగా….నిన్నటి మ్యాచ్ లో జరిగిన ఓ ఆసక్తికరమైన సన్నివేశం అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచ్ జరిగినంత సేపు పాక్ ప్లేయర్స్ ఏదో ఒక రకంగా డ్రామా క్రియేట్ చేయడానికి మరియు టీమ్ ఇండియా ను ఒత్తిడికి గురి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

secret message that rohit sent with rishabh pant

ఈ నేపథ్యంలో మ్యాచ్ మధ్యలోనే ఎంపైర్ కు టీం ఇండియా తీరు పై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ సీక్రెట్ మెసేజ్ లు పాస్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశాడు. పూర్తి ఉత్కంఠతతో సాగిన నిన్నటి మ్యాచ్లో భారత్ జట్టు విజయానికి ఆఖరి 12 బంతుల్లో 21 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో పాక్ ఫాస్ట్ బౌలర్ అయిన హారిస్ రౌఫ్ ఇన్నింగ్స్ 19 ఓవర్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ లోని మొదటి బంతి కి హార్దిక్ పాండ్య సింగిల్ రన్ తీయడంతో రవీంద్ర జడేజా కు నెక్స్ట్ స్ట్రైక్ లభించింది.

secret message that rohit sent with rishabh pant

కానీ తన గ్లోవ్స్ చెమటతో తడిచిపోయిన కారణం గా మార్చుకున్నాకే ఇన్నింగ్స్ ప్రారంభించాలని జడేజా ఎంపైర్ని కోరాడు. కానీ ఓవర్ మధ్యలో అలా వీలు కాదు అని ఎంపైర్ నిరాకరించాడు. అయితే…జడేజా ఎంపైర్ మాటలను పక్కనపెట్టి బౌండరీ లైన్ అవతల ఉన్న రిషబ్ పంత్ కు గ్లోవ్స్ తెమ్మని సిగ్నల్ ఇచ్చాడు. జడేజాకు గ్లౌజ్ అందిస్తూ రిషబ్ పంత్ మెల్లిగా ఏదో చెప్పాడు అని పాకిస్తాన్ కెప్టెన్ ఎంపైర్ కు ఫిర్యాదు ఇచ్చాడు. అసలు ప్లేయింగ్ 11లో లేని రిషబ్ పంత్ గ్రౌండ్‌లో రావడం కేవలం టీమిండియా ప్లాన్ అని, కెప్టెన్ రోహిత్ శర్మ ఏదో సీక్రెట్ మెసేజ్ అతని ద్వారా జడేజాకి పంపించాడు అని పాక్ కెప్టెన్ ఫిర్యాదు.

secret message that rohit sent with rishabh pant

రిషబ్ పంత్.. రవి బిష్ణోయ్‌తో కలిసి గ్లోవ్స్‌ పట్టుకుని మైదానంలోకి వచ్చాడు….కానీ జడ్డూ మాత్రం బిష్ణోయ్ గ్లోవ్స్ అందించబోయినా తీసుకోకుండా పంత్ చేతి నుంచి తీసుకున్నాడు…అదే సమయంలో రిషబ్ అతనితో మెల్లిగా ఏదో చెప్పాడు.
ఇంతకీ ఆ మెసేజ్ సారాంశం ఏమిటో తెలుసా….. నెక్స్ట్ ఓవర్ లో బౌలింగ్ కి ఎడమచేతి వాటం స్పిన్నర్ మహ్మద్ నవాబ్ వస్తాడు….కాబట్టి లెప్ట్ హ్యాండర్‌ అయిన జడేజా ఎలాగైనా ఆఖరి ఓవర్ వరకూ క్రీజులో ఉండాలి అని. అప్పటికే పాక్ బౌలర్స్ అందరి కోట అయిపోయింది, ఇక మిగిలింది మహ్మద్ నవాబ్ కాబట్టి ఇదే విషయాన్ని రోహిత్ శర్మ రిషబ్ ద్వారా చెప్పి పంపించాడు. ఏది ఏమైనప్పటికీ ఇంట్రెస్టింగ్ గా సాగిన నిన్నటి మ్యాచ్ భారత్ గెలుపును టీమిండియా అభిమానులు ఆద్యంతం ఆస్వాదించారు.


End of Article

You may also like