“యువరాజ్ సింగ్” తో పాటు… ఈ 10 ఇండియన్ క్రికెటర్లకి ఉన్న “సెంటిమెంట్స్” ఏంటో తెలుసా..?

“యువరాజ్ సింగ్” తో పాటు… ఈ 10 ఇండియన్ క్రికెటర్లకి ఉన్న “సెంటిమెంట్స్” ఏంటో తెలుసా..?

by kavitha

Ads

ఈ రోజుల్లో కూడా చాలా దేశాలలో ప్రజలు రకరకాల మూఢనమ్మకాలను కలిగి ఉంటారు. వాటిని చాలా విశ్వసిస్తారు. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా వివిధ దేశాల ప్లేయర్స్ కూడా ఇలాంటి వాటిని నమ్ముతుంటారు. మన భారత క్రికెటర్లు కూడా ఇలాంటివాటిని నమ్ముతూ ఉంటారు.

Video Advertisement

వారు సాధారణ ఆటగాళ్లు కాదు. వారిలో ఇండియన్ క్రికెట్ లో ఎన్నో రికార్డులు సృష్టించిన టాప్ క్రికెటర్స్ ఉన్నారు. నమ్మలేని విధంగా ఉన్న ఇది వాస్తవం. మరి ఆ క్రికెటర్లు ఎవరో? వారు పాటించే ఆ మూఢనమ్మకాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. జహీర్ ఖాన్: 

21 సెంచరీలో భారత క్రికెట్ జట్టులో ఉన్న అత్యుత్తమ పేసర్ జహీర్ ఖాన్. ఎన్నో మ్యాచ్ లలో తన బౌలింగ్ జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. జహీర్ ఖాన్ ముఖ్యమైన మ్యాచ్‌ల ఆడేటపుడు పసుపు రంగు రుమాలును వెంట తెచ్చుకునేవాడు. దానిని అదృష్టంగా నమ్మి పసుపు రుమాలు తీసుకుని వెళ్లేవాడు.
2. వీరేంద్ర సెహ్వాగ్:

విధ్వంసకర బ్యాట్స్ మెన్ గా పేరు గాంచిన వీరేంద్ర సెహ్వాగ్ టెస్ట్ క్రికెట్ లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ గా చరిత్ర సృష్టించారు. తన బ్యాటింగ్ తో బౌలర్లను భయపెట్టిన సెహ్వాగ్ కూడా మూఢ నమ్మకాలను కలిగి ఉన్నాడు. తన కెరీర్ ను జెర్సీ 44 నంబర్‌తో ప్రారంభించాడు. కానీ అడి అచ్చి రాలేదు. దాంతో వేరే నంబర్లను ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. దాంతో ఒక న్యూమరాలజిస్ట్ సలహా మేరకు నంబర్ లేని జెర్సీ వాడటం మొదలు పెట్టాడు. ఆశ్చర్యకరంగా అప్పటి నుండి బ్యాటింగ్ తో విధ్వంసంను సృష్టించాడు.
3. సచిన్ టెండూల్కర్:

భారతదేశంలో క్రికెట్ ను ఒక మతంగా మార్చిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్. క్రికెట్ గాడ్ గా పేరు గాంచాడు. అయితే క్రికెట్ ఆడే దేవుడికి కూడా మూఢ నమ్మకాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకుండా ఉండదు. సచిన్ టెండూల్కర్ మ్యాచ్ ఆడే ముందు ప్రతిసారీ తన ఎడమ ప్యాడ్‌ను ముందుగా ధరించేవాడు. అలా సచిన్ తన కెరీర్ మొత్తం అలాగే చేసేవాడు. అలాగే తన బ్యాట్ విరిగిపోయిన లేదా దెబ్బతిన్నప్పుడు కూడా దానిని ఎప్పుడూ మార్చలేదు. ఎప్పుడూ తన బ్యాట్‌ను రిపేర్ చేసుకునేవాడు. ఆ బ్యాట్ తోనే సచిన్ అత్యధిక సెంచరీలు సాధించాడు.
4. సౌరవ్ గంగూలీ: 

క్రికెట్ చరిత్రలో ఎప్పటికి ఉండేపేరు సౌరవ్ గంగూలీ. దాదాగా పేరుగాంచిన  గంగూలీ కూడా  మూఢనమ్మకాలను కలిగి ఉన్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ గంగూలీ తన గురువు ఫోటోను తన జేబులో పెట్టుకుని తీసుకువెళ్లాడు. అది తనకు విజయాన్ని తెచ్చిపెట్టిందని నమ్మాడు. అలాగే ఉంగరాలు, నెక్లెస్‌లు కూడా అదృష్టంగా భావించి ధరించేవాడు.5. రాహుల్ ద్రవిడ్:

రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ లో ‘ది వాల్’ గా పేరు గాంచాడు. టాప్ క్రికెటర్ అయిన ద్రవిడ్ కూడా మూఢనమ్మకాలను  విశ్వసించేవాడు. బ్యాటింగ్ వెళ్లేముందు మొదట కుడి ప్యాడ్ ను ధరించడం అదృష్టమని నమ్మేవాడు. కెరీర్ మొత్తం కూడా డనినే పాటించాడు. అలాగే సిరీస్‌కు ముందు ద్రవిడ్ కొత్త బ్యాట్‌ని ఎప్పుడూ ప్రయత్నించలేదు.
6. యువరాజ్ సింగ్: 

6 బంతులలో 6 సిక్స్ లు కొట్టిన యువరాజ్ సింగ్ కూడా మూఢనమ్మకాలను విశ్వసించేవాడు. యువరాజ్ ఎల్లప్పుడూ 12 నంబర్ జెర్సీ నే ధరించేవాడు. ఆ జేరసిని అదృష్టంగా భావించేవాడు.  ఎందుకంటే యువరాజ్ 12 వ నెలలో 12న పగలు 12 గంటలకు, చండీఘర్ లోని 12 వ సెక్టార్ లో జన్మించాడు. అందువల్ల, అతను నంబర్ 12 జెర్సీని  అదృష్టంగా భావించేవాడు.
7. రవిచంద్రన్ అశ్విన్:

రవిచంద్రన్ అశ్విన్ కు ఒక మూఢ నమ్మకం ఉంది. అతను అదృష్టంగా నమ్మే ఒక బ్యాగ్ ను తీసుకెళ్ళేవాడు. 2011 ప్రపంచ కప్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ, ప్రపంచ కప్ గెలవడంతో అతను వెంట ఆ బ్యాగ్ తీసుకెళ్లడం అదృష్టమని భావించేవాడు.
8. విరాట్ కోహ్లీ: 

కింగ్ కోహ్లీ గా పేరు గాంచిన విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో బ్యాటింగ్ లో  టాప్ క్రికెటర్ గా ఉన్నాడు, రం మెషీన్ గా పేరుగాంచాడు. అయితే అలాంటి క్రికెటర్ కూడా మూఢనమ్మకాలను విశ్వసిస్తాడు. అతను మ్యాచ్ లో తెలుపు రంగు షూలను ధరిస్తాడు. అవి తనకు శక్తిని ఇస్తాయని కోహ్లీ నమ్ముతాడు. ఈ విషయన్ని ఒక ఇంటర్వ్యూలో కోహ్లీ చెప్పడం విశేషం.
9. రోహిత్ శర్మ:

వన్డే క్రికెట్ లో రెండు డబుల్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ కూడా మూఢనమ్మకాలను విశ్వసిస్తాడు. గ్రౌండ్ లో అడుగుపెట్టె ముందు మొదట కుడికాలును పెట్టి వెళతాడు. అలా చేయడం వల్ల ఆరోజు బాగా ఆడుతానని  నమ్మేవాడు. అన్ని సార్లు ఫలించకపోయిన కొన్నిసార్లు ఫలించనందువల్ల అతను దానిని ఫాలో అవుతాడు.
10. మొహిందర్ అమర్‌నాథ్:

భారత లెజెండరీ క్రికెటర్ మొహిందర్ అమర్‌నాథ్  1983 ప్రపంచ కప్ గెలవడం లో కీలక పాత్రను పోషించాడు. 1983 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆఖరి వికెట్‌ను తీసింది కూడా అమర్‌నాథే.  ఆయన తన కెరీర్‌లో ఎప్పుడు మ్యాచ్ ఆడిన తన లక్కీ ఎరుపు రుమాలును తన జేబులో పెట్టుకునేవాడు.

Also Read: “ధోనీ లాగానే వేరే వాళ్ళు ప్రవర్తిస్తే ఊరుకుంటారా..?” అంటూ కామెంట్స్..! ఏం జరిగిందంటే..?


End of Article

You may also like