రియల్ లైఫ్ లో భార్యాభర్తలుగా మారిన… 16 “బుల్లితెర” నటులు.!

రియల్ లైఫ్ లో భార్యాభర్తలుగా మారిన… 16 “బుల్లితెర” నటులు.!

by Mohana Priya

Ads

మామూలుగా ఇద్దరు వ్యక్తులు కలిసి పని చేస్తూ ఉంటే ముందు స్నేహితులు అవ్వడం తర్వాత వారి అభిప్రాయాలు కలిసి ప్రేమికులు అవ్వడం తర్వాత పెళ్లి చేసుకోవడం సహజమే.

Video Advertisement

ఇది అన్ని రంగాల్లో జరిగే విషయమే. కానీ సెలబ్రిటీల జీవితం తెరిచిన పుస్తకం లాంటిది కాబట్టి వాళ్లు ఎవరినైనా ప్రేమిస్తే అందరికీ తెలిసిపోతుంది.

ఇంక వాళ్ళు పెళ్లి చేసుకుంటే మామూలు వ్యక్తులే కాకుండా మీడియా కూడా అంతే ఆసక్తిగా సెలబ్రిటీల పెళ్లిళ్లలో జరిగే ప్రతి అప్డేట్ ఇస్తూ ఉంటుంది.  సీరియల్స్ లో నటించే నటులని దాదాపు ప్రతి కుటుంబం తమ ఇంట్లో వారిగా అనుకుంటారు. కాకపోతే వాళ్ళలో కూడా ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు అని ఆ సెలబ్రిటీలు చెప్పేంతవరకు ఎక్కువ మందికి తెలియదు. అవును. సినిమా వాళ్ళే కాకుండా సీరియల్ వాళ్ళ లో కూడా తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.వాళ్ళెవరంటే.

#1 నిరుపమ్ – మంజుల

వీళ్ళిద్దరూ కలిసి చంద్రముఖి సీరియల్ లో నటించారు. అప్పుడే ప్రేమించుకున్నారు.  కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకున్నారు.

#2 నగేష్ కర్రా – ప్రీతినిగమ్

ఇద్దరూ కలిసి రుతురాగాలు, కస్తూరి సీరియల్స్ లో నటించారు.

#3 ప్రియతమ్ – మానస

మానస ముద్దమందారం, ఇద్దరమ్మాయిలు సీరియల్స్ లో నటించారు. ప్రియతమ్ మనసు మమత సీరియల్ లో నటించారు.

#4 ప్రతాప్ – అనూష హెగ్డే

ప్రతాప్ శశిరేఖ పరిణయం సీరియల్ తో అందరికీ పరిచయమే. అనూష సూర్యకాంతం సీరియల్ చేస్తున్నారు.

#5 ఇంద్రనీల్ – మేఘన రామి

ఇద్దరూ కలిసి చక్రవాకం సీరియల్ లో నటించారు.

#6 మెరీనా అబ్రహం – రోహిత్

మెరీనా అమెరికా అమ్మాయి సీరియల్ తో పరిచయమైంది. ప్రస్తుతం సిరిసిరి మువ్వలు సీరియల్ లో నటిస్తోంది. రోహిత్ కూడా అభిషేకం సీరియల్ లో నటించాడు.

#7 ధనుష్ – కీర్తి

తూర్పు పడమర సీరియల్ తో పరిచయమైన కీర్తి తర్వాత ఎన్నో సీరియల్స్ చేశారు. ధనుష్ ప్రస్తుతం నంబర్ వన్ కోడలు సీరియల్ చేస్తున్నారు.

#8 జాకీ – హరిత

వీరిద్దరూ కలిసి సంఘర్షణ సీరియల్ లో నటించారు.

#9 కిరణ్ – సుష్మ

ఇద్దరూ కలిసి అభిషేకం సీరియల్ లో నటించారు.

#10 మధుసూదన్ – శృతి

వీళ్ళిద్దరికీ మొగలిరేకులు సీరియల్ సమయంలో పరిచయం అయింది.

#11 ధర్మ – సుహాసిని

వీళ్ళిద్దరూ కలిసి ఇద్దరు అమ్మాయిలు సీరియల్ లో నటించారు.

#12 మధు – లక్ష్మీ శ్రీ

మధు ప్రస్తుతం నా పేరు మీనాక్షి సీరియల్ లో నటిస్తున్నాడు. లక్ష్మీ శ్రీ కూడా ఎన్నో సీరియల్స్ లో సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది.

#13 సిద్ధార్థ్ – విష్ణు ప్రియ

ఇద్దరూ నేను నా ఫ్రెండ్స్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తర్వాత ఎన్నో సీరియల్స్ చేశారు.

#14 శ్యామల – నర్సింహ

శ్యామల ప్రస్తుతం యాంకర్ గా ఎన్నో షోలు చేస్తోంది. నర్సింహ కూడా చంద్రముఖి తో పాటు,  ఇంకా ఎన్నో సీరియల్స్ లో నటించాడు.

#15 అమర్‌దీప్ చౌదరి – తేజస్విని

అమర్‌దీప్, తేజస్విని కూడా ప్రేమించుకున్నారు. ఇటీవ‌ల వీరి ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది

#16 కళ్యాణ్ – శ్రీలేఖ

శ్రీలేఖ యాంకర్ గా ఎన్నో షోస్ చేశారు. కళ్యాణ్ రాధ మధు, కాంచన గంగ సీరియల్ సీరియల్స్ తో సుపరిచితుడు అయ్యారు.


End of Article

You may also like