Home gossips Priyanka Jain : స్టార్ హీరో సినిమాలో అవకాశం దక్కించుకున్న “ప్రియాంక జైన్”..! ఏ సినిమాలో అంటే..?

Priyanka Jain : స్టార్ హీరో సినిమాలో అవకాశం దక్కించుకున్న “ప్రియాంక జైన్”..! ఏ సినిమాలో అంటే..?

by Mohana Priya

మన సీరియల్ హీరోయిన్స్ కి కూడా సినిమా హీరోయిన్స్ కి ఉన్నంత క్రేజ్ ఉంటుంది. అలా, కొంత కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్న సీరియల్ నటి ప్రియాంక జైన్. ప్రియాంక జైన్ ప్రస్తుతం జానకి కలగనలేదు అనే సీరియల్ లో నటిస్తున్నారు.

ప్రియాంకకి ఇప్పుడు ఒక సినిమా అవకాశం వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఒక స్టార్ హీరో సినిమాలో ప్రియాంక నటించబోతున్నట్టు సమాచారం. ప్రియాంక, నాగార్జున హీరోగా నటిస్తున్న బంగార్రాజు సినిమాలో నాగార్జున చెల్లెలి పాత్ర పోషిస్తున్నారట. ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సీక్వెల్‌గా వస్తోంది.

serial actress priyanka jain to act with this star hero

ప్రియాంక అంతకముందు కూడా చల్తే చల్తే, వినరా సోదర వీరకుమార వంటి కొన్ని సినిమాల్లో నటించారు. ఇప్పుడు మళ్లీ చాలా కాలం తర్వాత బంగార్రాజు సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బంగార్రాజు సినిమా విషయానికొస్తే, నాగ చైతన్య కూడా ఈ సీక్వెల్‌లో నటిస్తున్నారు. మొదటి పార్ట్‌కి దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ, బంగార్రాజుకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. రమ్య కృష్ణ, క్రితి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

You may also like