ఏప్రిల్ నుంచి ఈ రాశుల వారికి శని ప్రభావం నుంచి విముక్తి.. వీరికి మాత్రం ఇబ్బందులు తప్పవు..!

ఏప్రిల్ నుంచి ఈ రాశుల వారికి శని ప్రభావం నుంచి విముక్తి.. వీరికి మాత్రం ఇబ్బందులు తప్పవు..!

by Anudeep

Ads

ఇంకొక్క రోజులో మార్చి ముగిసి ఏప్రిల్ నెల మొదలవబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ నెలలో శని దేవుడు రాశి మారబోతున్నారు. ఫలితంగా కొన్ని రాశుల వారికి శని ప్రభావం నుంచి విముక్తి కలగబోతోంది. ఏయే రాశుల వారికి శని ప్రభావం నుంచి విముక్తి కలుగబోతోందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Video Advertisement

ఇతర గ్రహాలతో పోలిస్తే.. శని గ్రహం నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడానికి శని గ్రహానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం మకర రాశిలోనే ఉన్న శని త్వరలో కుంభరాశిలోకి ప్రవేశించబోతోంది.

శని దేవుడు రాశిని మార్చినప్పుడల్లా ఆ ప్రభావం పన్నెండు రాశుల పైనా పడుతుంది. కొన్ని రాశుల వారు రెండున్నర ఏళ్ల పాటు శని ప్రభావాన్ని ఎదుర్కొంటారు. ఏ రాశి నుంచి శని బయటకి వస్తాడో.. వారు శని గ్రహ ప్రభావం నుంచి విముక్తులవుతారు. ఈ శని గ్రహం ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి పరివర్తనం చెందడం వలన కొన్ని రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.. మరి కొన్ని రాశుల వారు ఉత్తమ ఫలితాలు పొందుతుంటారు.

sani 2

ఏ రాశి నుంచి అయితే శని బయటకు వస్తాడో.. ఆ రాశి ప్రజలు శని మహర్దశ నుంచి విముక్తి పొందుతారు. శని బయటకు వెళ్ళిపోతూ.. ఆ రాశి వారికి మంచి చేసి వెళ్లిపోతుంటాడు. అలా శని నుంచి విముక్తి లభిస్తూనే వారికి మంచి రోజులు మొదలవుతాయి. ఏప్రిల్ 29 న శని మకర రాశి నుంచి కుంభ రాశి లోకి ప్రవేశించనున్నాడు. ఈ శని పరివర్తనంతో ధనుస్సు రాశి వారు శని ప్రభావం నుంచి విముక్తి పొందుతారు. అలాగే, . మిథునం, తుల రాశుల వారు కూడా శని గ్రహ ప్రభావం నుంచి తప్పించుకోనున్నారు. కుంభ రాశిలోకి ప్రవేశించిన శని తిరిగి జూలై 12న మరోసారి మకరరాశిలో ప్రవేశిస్తారు. అప్పుడు ధనుస్సు,మిథునం, తుల రాశుల వారు తిరిగి శని దశను అనుభవించాల్సి ఉంటుంది. ఈ మూడు రాశుల వారికి 2023 లో శని గ్రహం నుంచి విముక్తి లభించనుంది.


End of Article

You may also like