Home Sports Adda శిఖర్ ధావన్ పోస్ట్ చూసి ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్…ఇంతకీ ఏం పెట్టాడంటే…!

శిఖర్ ధావన్ పోస్ట్ చూసి ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్…ఇంతకీ ఏం పెట్టాడంటే…!

by Sainath Gopi

Ads

భారత్ క్రికెటర్ శిఖర్ ధవన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.తన బ్యాటింగ్ తో అలరిస్తూ భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు.ఆయనను అభిమానులు ముద్దుగా గబ్బర్ అని పిలుచుకుంటారు. అయితే శిఖర్ ధావన్ ప్రస్తుతం ఫామ్ కోల్పోవడంతో భారత టీమ్ లో చోటు కూలిపోయాడు.

Video Advertisement

తాజాగా శిఖర్ ధావన్ తన భార్య నుండి విడాకులు తీసుకున్నాడు. శిఖర్ ధావన్ పిల్లలు తన భార్యతోనే ఉంటున్నారు. తన ఇంస్టాగ్రాంలో శిఖర్ ధావన్ కొడుకు కు సంబంధించిన ఒక పోస్టును పెట్టాడు. అది చూసిన ఫ్యాన్స్ ఎమోషనల్ అయిపోతున్నారు. ఇంతకీ ఆ పోస్టులో ఏం పెట్టాడంటే…

తన కుమారుడు జొరావర్ పుట్టినరోజును పురస్కరించుకుని నిన్ను చూసి ఏడాది అవుతుంది…అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. నిన్ను నాకు పూర్తిగా దూరం చేసేందుకు. ప్రయత్నిస్తున్నారు…నీతో నేరుగా మాట్లాడి 3 నెలలు అవుతుంది,నీతో మాట్లాడకుండా నన్ను బ్లాక్ చేస్తున్నారు.అయిన టేలిపతి ద్వారా నీ మనసుకి దగ్గరగానే ఉంటాను.నువ్వు ఉన్నతంగా ఎదుగుతావు అని తెలుసు..ఈ పాపా ఎప్పుడు నిను మిస్ అవుతున్న ఉంటాడు అంటూ పాత వీడియో కాల్ స్క్రీన్ షాట్ షేర్ చేశాడు.దేవుడు దయ వల్ల మళ్ళీ మనం కలుస్తాం అంటూ రాసుకొచ్చాడు.ఈ పోస్ట్ చదివి అభిమానులు ఎమోషనల్ అయిపోతున్నారు.శిఖర్ కి తన మద్దతు ప్రకటిస్తున్నారు.


End of Article

You may also like