ఎద్దు రైడ్ లో తన సత్తా చాటిన థర్డ్ కంటెస్టెంట్…. శోభా….

ఎద్దు రైడ్ లో తన సత్తా చాటిన థర్డ్ కంటెస్టెంట్…. శోభా….

by Mohana Priya

Ads

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రస్తుతం ఎంతో రసవత్తంగా సాగుతోంది. నిన్న మొన్నటివరకు ఎంతో ఫ్రెండ్లీగా బిహేవ్ చేసిన కంటెస్టెంట్స్ రోజులు గడిచేకొద్దీ సైకో లాగా మారిపోతున్నారు. రోజుకొక రచ్చ, గొడవ.. స్కెచ్ ఇలా సాగుతోంది బిగ్ బోస్ పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ వారం కంటెస్టెంట్ నుంచి హౌస్ మేటుగా మారడం కోసం జరిగిన పోటీలలో శోభ ,అమరదీప్ ,ప్రియాంక విషయం తెలిసిందే.

Video Advertisement

ఈ క్రమంలో నిన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడిన నాగార్జున శోభతో ..అమరదీప్ ,ప్రియాంక ఇద్దరి మధ్యలో జరిగిన పోటీలో సులభంగా గెలిచే అవకాశం ఉండి కూడా కంటస్ట్ అయ్యే ఆఫర్ ని వదులుకున్న వ్యక్తి ఎవరు అని సూటిగా అడిగారు. దానికి శోభ సమాధానం చెప్పడానికి తలబడడంతో హౌస్ లో అందరికంటే కంటెస్టెంట్ నువ్వే అని చురకలు వేశారు. ఇక లాభం లేదు అనుకున్న శోభ అమరదీప్ పేరు చెప్పింది.

ఇక ఆ తర్వాత థర్డ్ హౌస్ కంటెస్టెంట్ గా మారడానికి ఎద్దు పోటీలో పాల్గొన్న శోభ, ప్రియాంక ఇద్దరిలో మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలుస్తారు అని అమరదీప్ ని నాగార్జున అడిగారు. కాస్త నాంచిన చివరికి ప్రియాంక గెలవాలని ఉంది అని అమర్ దీప్ ఒప్పుకున్నాడు. దీనికి హర్ట్ అయిన ప్రియాంక మేము లాస్ట్ పోటీలో పాల్గొనేటంతవరకు కూడా ఇద్దరిలో ఎవరు గెలిచినా నాకు ఓకే అని అమరదీప్ అన్నాడు అని అంది.

అంతే అమ్మ తెలియాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అని నాగార్జున శోభతో అన్నాడు. ఇక పోటీకి సంచారకులుగా వ్యవహరిస్తున్న,ఆల్రెడీ హౌస్ మేట్స్ అయినా…శివాజీ, సందీప్ .. మూడవ హౌస్ మేట్ ఎవరు అని అడిగినప్పుడు శివాజీ తన పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదని, ఎవరు గెలిచినా ఒకటే అని తప్పించుకున్నాడు. సందీప్ మాత్రం లోపల ఎద్దు పోటీ జరిగినప్పుడు ప్రియాంక ,శోభ కంటే ఎక్కువసేపు ఉంది కాబట్టి తనే విన్నర్ అవుతుందేమో అని అన్నాడు.

దీనికి నాగార్జున లెక్కల్లో చాలా తేడాలు వస్తున్నాయి మొన్న లెగ్ పీస్ లెక్కల్లో తేడా వచ్చినట్లు అని చురక విసిరారు. ఇక ఆ తర్వాత నాగ్ సార్ చెప్పిన లెక్కల ప్రకారం మొత్తం జరిగిన మూడు రౌండ్లకు గాను ప్రియాంక 2 నిమిషాల 41 సెకండ్లు ఎద్దు మీద ఉండగలిగితే…. శోభ 2 నిమిషాల 53 సెకండ్ లు ఎద్దు పై ఉండి థర్డ్ హౌస్ కంటెస్టెంట్ గా గెలిచింది. మొత్తానికి ఈ వారం ప్రతి టాస్క్ లో మంచి ఆట కనబరుస్తూ శోభ…హౌస్ కంటెస్టెంట్ గా అవ్వడం తో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో తమ హ్యాపీనెస్ పోస్టుల ద్వారా పంచుకుంటున్నారు.

 


End of Article

You may also like