ఎయిర్ క్రాఫ్ట్ నుంచి పిట్టల్లా రాలిపడిపోతున్న ప్రజలు.. దారుణం గా కాబుల్ ఎయిర్ పోర్ట్ లో పరిస్థితి..!

ఎయిర్ క్రాఫ్ట్ నుంచి పిట్టల్లా రాలిపడిపోతున్న ప్రజలు.. దారుణం గా కాబుల్ ఎయిర్ పోర్ట్ లో పరిస్థితి..!

by Anudeep

Ads

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అధికారం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి, రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రజాస్వామ్య దేశం అయిన ఆఫ్గనిస్తాన్ ప్రస్తుతం తాలిబన్ల చేతిలో ఉంది. ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి దేశం వదిలి వెళ్లిపోయారు.

Video Advertisement

kabul airport 1

ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ లో పరిస్థితి అల్లకల్లోలం గా ఉంది. తాలిబన్లకు అధికారం దక్కడం తో.. అక్కడి ప్రజలు అయోమయం లో పడ్డారు. తేరుకుని.. ఆ దేశం నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆ దేశం లో ఉండలేక.. బయటకు వెళ్లలేక చాలా అవస్థ పడుతున్నారు. కొందరు కార్ లలోనే వెళ్లిపోవాలని ప్రయత్నించారు. అయితే.. కాబుల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక్క ఫ్లైట్ మాత్రమే ఉంది.

kabul airport 2

ఆ ఫ్లైట్ లోనే అందరు అక్కడనుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారు. కాబుల్ ఎయిర్పోర్ట్ లో గుంపులు గుంపులు గా జనం దూసుకురావడం తో పరిస్థితి అల్లకల్లోలం గా మారింది. ఒక్క ఫ్లైట్ లోనే ఎక్కువ మంది ఎక్కడం తో.. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యిన వెంటనే జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇది వీడియోలలో కూడా రికార్డు అయింది.

kabul airport 3

ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఒకప్పుడు.. ఫ్లైట్స్ కూడా ఆర్టీసీ బస్సుల్లా మారితే ఎలా ఉంటుంది అని మీమ్స్ వేసేవారు.. ఇప్పుడు ఇది నిజం గా జరుగుతుంటే ప్రపంచ దేశాల్లోని ప్రజలు ఆఫ్గనిస్తాన్ ప్రజల పరిస్థితిని చూసి బాధపడుతున్నారు. ఈ కింద వీడియోస్ ను చూడండి.. వారి పరిస్థితి ఎంత దారుణం గా ఉందో అర్ధం అవుతుంది.

https://www.instagram.com/reel/CSoX5SPJlef/?utm_medium=share_sheet


End of Article

You may also like