Ads
ఇటీవల దుబాయ్ లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో సన్ రైజర్స్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల పట్ల మిశ్రమ స్పందన వచ్చింది. సన్రైజర్స్ సీఈఓ కావ్య మారని తీసుకున్న నిర్ణయాలు బాగాలేదని పలువురు విమర్శించారు. ఎక్కువమంది విదేశీ ప్లేయర్స్ ను కొనుగోలు చేయడం ఎందుకు అంటూ ప్రశ్నించారు. అయితే కావ్య తీసుకున్న డిసిషన్ సూపర్ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Video Advertisement
ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన అనంతరం జట్టు ప్రక్షాళన చేపట్టిన శ్రీలంక క్రికెట్ బోర్డు తాజాగా కొత్త కెప్టెన్లను నియమించింది. టీ20 జట్టుకు కెప్టెన్‌గా నయా ప్లేయర్ హసరంగను ఎంపిక చేసింది. ఇటీవల జరిగిన వేలంలో హసరంగను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.1.50 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ స్టార్ స్పిన్నర్‌కు వేలంలో భారీ డిమాండ్ ఉంటుందని అందరూ అంచనా వేశారు. కానీ ఎస్‌ఆర్‌హెచ్ తక్కువగా ధరకే సొంతం చేసుకుంది.ఇక హసరంగ సారథిగా లంక ప్రీమియర్ లీగ్‌లో క్యాండీ జట్టుకు టైటిల్ అందించాడు.
హసరంగ లంక కెప్టెన్‌గా ఎంపిక అవ్వడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కెప్టెన్సీ అనుభవం ఉన్న ప్లేయర్ల సంఖ్య మూడుకు చేరనుంది. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ మార్క్‌రమ్‌తో పాటు ప్యాట్ కమిన్స్, హసరంగ ఉన్నారు. ఇక వేలంలో కమిన్స్ కోసం హైదరాబాద్ రూ.20.50 కోట్లు చెల్లించిన విషయం తెలిసిందే. కమిన్స్‌కు భారీ ధర చెల్లించడం వెనుక అతడిని కెప్టెన్‌గా నియమించే అవకాశాలూ ఉన్నాయని తెలుస్తోంది. దీంతో కావ్య మారన్ హసరంగానే కొనుగోలు చేసి మంచి పని చేసిందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
End of Article