Sun risers Hyderabad:ఆణిముత్యాలను వదిలేసి..రంగురాళ్లను నెత్తిన పెట్టుకున్నారు.. చివరికి బోల్తా పడ్డారు..!!

Sun risers Hyderabad:ఆణిముత్యాలను వదిలేసి..రంగురాళ్లను నెత్తిన పెట్టుకున్నారు.. చివరికి బోల్తా పడ్డారు..!!

by Sunku Sravan

Ads

ఇండియన్ ప్రీమియర్ లీగ్2022 సీజన్ మరో వారంలో ముగియనుంది. ఎప్పుడూ లేని విధంగా రెండు ప్లేఆప్స్ బేర్తుల కోసం చాలా పోటీ నెలకొంది. ఇందులో నాలుగు టీమ్స్ మధ్య పోరు పంతం నీదా నాదా అన్నట్టుగా సాగుతోంది.

Video Advertisement

ఇందులో హైదరాబాద్ జట్టు విషయానికొస్తే.. 6 జట్లలో ఒక జట్టుగా ప్లే ఆప్స్ రేసులో ఉన్నది. అయినా సన్రైజర్స్ హైదరాబాద్ టీం నాకౌట్ దశకు చేరుకోవడం కష్టంగానే ఉన్నది.

పోయిన సీజన్లో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న హైదరాబాద్.. కానీ ఈ సీజన్లో మాత్రం చాలా మార్పు తీసుకొచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా జట్టుకు వెన్నెముకగా ఉన్న వార్నర్, రషీద్ ఖాన్ లను కాదనుకొని ఈసారి కొత్త ప్లేయర్ లతో ట్రై చేసింది. ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తుంది. కానీ హైదరాబాద్ వదులుకున్న ఇద్దరు ప్లేయర్ లే ఐపీఎల్ లో దుమ్మురేపుతున్నారు.

#డేవిడ్ వార్నర్
ఐపీఎల్ లో చాలా నిలకడతో ఉన్న విదేశీ ప్లేయర్. భారత ఆటగాళ్లు సొంత మైదానంలో ఆడినట్టే డేవిడ్ వార్నర్ కూడా ఐపీఎల్ లో తన బ్యాట్ పదును ఏంటో చూపించాడు. మొదటిగా ఢిల్లీ జట్టులో ఎంట్రీ ఇచ్చిన ఆయన 2013 వరకు ఆ టీం లోనే గడిపారు. వార్నర్ 2014 సీజన్ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఇక అప్పటి నుంచి ఆయన దశ మారిపోయింది. హైదరాబాద్ జట్టుకు వార్నర్ ఎన్నో ఫలితాలను అందించారు.

బ్యాడ్ బాయ్ ఇమేజ్ నుండి.. గుడ్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు వార్నర్. అలాగే 2016 సన్రైజర్స్ హైదరాబాద్ ను ఛాంపియన్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.. దీంతో తెలుగు రాష్ట్రాల ప్లేయర్లు డేవిడ్ బాయ్ అని కొనియాడారు. 2021లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆయనకు ఫుల్స్టాప్ పడింది. కెప్టెన్సీ నుంచి తొలగించిన సన్రైజర్స్ అతన్ని బెంచ్ కి పరిమితం చేసింది. వార్నర్ తో కూల్ డ్రింక్ కూడా మోయించింది . దీంతో అవమాన పడిన ఆయన జట్టు ను విడాల్సి వచ్చింది.

వార్నర్ ను బయటకు వచ్చిన తర్వాత కెప్టెన్సీ ని కెన్ విలియంసన్ కు అప్పజెప్పింది.. కానీ కెన్ ఒక్క మ్యాచ్ లో కూడా సరిగ్గా ఆడింది లేదు. అయితే ఈ సీజన్ లో అతని బ్యాటింగ్ చాలా బ్యాడ్ గా ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 208 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓకే ఒక అర్థ సెంచరీ చేశాడు. ఈ విధంగా సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడం కోసమే మ్యాచు ఆడుతున్నట్టు కనబడుతోంది. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున రాహుల్ ఓపెనర్ గా మంచి ఇన్నింగ్స్ ఆడారు.

ఇలాంటి ప్లేయర్ ను అభిషేక్ శర్మకు జోడిగా పంపించకుండా.. టెస్ట్ బ్యాటింగ్ చేస్తున్నటువంటి విలియంసన్ ను పంపడం వల్ల సగటు సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానికి మింగుడుపడని అంశంగా చెప్పవచ్చు. వార్నర్ మరియు రషీద్ ఖాన్ లాంటి ఆణిముత్యాలను టీమ్ నుంచి గెంటేసి, విలియంసన్,సమద్ వంటి రంగు రాళ్లను టీంలో ఉంచుకుంది అంటూ ఆరెంజ్ ఆర్మీ పై అభిమానులు ఫైర్ అవుతున్నారు.. దీనికి ప్రధాన కారణం సన్రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారను కారణం అంటూ ట్రోల్ చేస్తున్నారు.

 


End of Article

You may also like