ఆంధ్ర ప్రదేశ్ లో ఆగష్టు 16 పాఠశాలలు పునప్రారంభం : ఏపీ సీఎం జగన్ ఆంధ్ర ప్రదేశ్ లో అగస్ట్ 16 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
అందుకుగాను అధికారులను ఆదేశించారు.నూతన విద్య విధానం పై సమగ్రంగా వివరించాలని, విద్యార్థులకు అదే రోజు విద్య కిట్ లు కూడా అందచేయాలని తెలిపారు. ‘నాడు-నేడు’ పనులని ప్రజలకి అంకితం ఇచ్చి రెండో విడత పనులని కూడా ప్రారంభించాలని ఆదేశించారు. కరోనా కారణంగా ఇప్పటికే విద్యాసంస్థలు మూత పడిన సంగతి తెలిసందే. కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే ప్రస్తుతం విద్యార్థులకి పాఠాలు చెబుతున్నారు.