ఆంధ్ర తెలంగాణా బోర్డర్ లో అంబులెన్సులు వెనక్కి పంపిస్తున్న తెలంగాణా పోలీసులు ఈ విషయం రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఖరోనా వైద్యానికి నిమిత్తం తెలంగాణ లో హైదరాబాద్ లోని హాస్పిటల్స్ లో చేరడానికి వస్తున్న వారిని అడ్డుకోవద్దు అంటూ ఇటీవలే తెలంగాణ హై కోర్ట్ కూడా జోక్యం చేసుకోవడంతో అక్కడితో సమస్య ముగిసిందనుకున్నారు.కానీ మళ్ళీ పోలీసులు అదే పని చేస్తుండటంతో ఇబ్బందిగా మారింది.కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఏపీ నుంచి వస్తున్న వాహనాలను మళ్లీ అనుమతించడం లేదని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఏపీ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించారు.
‘కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద మళ్ళీ వాహనాలను అనుమతించని తెలంగాణ పోలీసులు.ఉన్న హక్కులు పోగొట్టుకోవడంవల్లనే నేడు ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ పరిస్థితి వచ్చిందిపదేళ్లు ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాదు అనే విషయాన్ని మర్చిపోయారా కెసిఆర్ గారు? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు..
కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద మళ్ళీ వాహనాలను అనుమతించని తెలంగాణ పోలీసులు.
ఉన్న హక్కులు పోగొట్టుకోవడంవల్లనే నేడు ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ పరిస్థితి వచ్చింది
పదేళ్లు ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాదు అనే విషయాన్ని మర్చిపోయారా కెసిఆర్ గారు?
1/2 pic.twitter.com/zSBSYWy1S1— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) May 24, 2021
ఇవి కూడా చదవండి : అబ్బే.. అలాంటిదేంలేదు పుకార్లకు చెక్ పెట్టిన రాజుగారు !