ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా లేని లోటు నిన్న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కొట్టోచ్చినట్టు కనబడింది. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా టీం కి దూరమైన సంగతి తెలిసిందే. అప్పటినుండి హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్య కుమార్ యాదవ్ టీం లోకి వచ్చాడు. హార్దిక్ పాండ్యా లేకపోవడం వల్ల రోహిత్ శర్మ కి ఐదు బౌలింగ్ ఆప్షన్స్ మాత్రమే మిగిలాయి. ఫైనల్ వరకు కూడా ఐదుగురు బౌలర్స్ మాత్రమే బౌలింగ్ వేశారు.
హార్దిక్ టీం నుండి వెళ్లిపోయిన తర్వాత శార్దూల్ ఠాకూర్ ను తప్పించి షమీని బరిలోకి తీసుకువచ్చారు. షమీ రావడం కలిసి వచ్చిన అంశం అయినా కూడా హార్దిక్ పాండ్యా లేకపోవడం వల్ల టీం కి తీవ్రంగా నష్టం చేసింది.
ఒకవేళ నిన్న జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ఉండి ఉంటే జడేజా కంటే ముందు హార్దిక్ పాండ్యాని బ్యాటింగ్ పంపించేవారు. హార్దిక్ పాండ్యా బ్యాట్ తో కూడా రాణిస్తాడు అన్న సంగతి బాగా తెలిసిందే. కీలకమైన మ్యాచ్ లలో తన దూకుడైన బ్యాటింగ్ తో టీం ని గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఫైనల్ లో కనుక హార్దిక్ పాండ్యా ఉండుంటే టీం స్కోర్ 50 పరుగులు పెరిగి ఉండేదని క్రికెట్ నిపుణులు అంటున్నారు. స్కోర్ గనుక 300 చేరి ఉంటే నిన్న గెలుపు అవకాశాలు ఇండియాకే ఎక్కువగా ఉండేవి. అలాగే బౌలింగ్ లో కూడా హార్దిక్ పాండ్యా తన సహకారం అందించేవాడు. దీనికి సంబంధించి క్రికెట్ అభిమానులు కూడా హార్దిక్ పాండ్యా లేకపోవడం వల్ల టీం బాగా దెబ్బతింది అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ప్రతి ఒక్కరికి నిన్న హార్దిక్ పాండ్యా విలువ ఏంటో తెలిసి ఉంటుందని మరొకరు చెప్తున్నారు. ఏది ఏమైనా నిన్న అహ్మదాబాద్ పిచ్ లో ఇండియా కంటే ఆస్ట్రేలియా కె అన్ని అంశాలు బాగా కలిసి వచ్చాయి.ఇండియా కూడా బాగా ఫామ్ లో ఉన్న టీం.ఎవరిని నిందించాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే చివరిదాకా వచ్చి కప్పు నెగ్గలేక పోయమే అన్న బాధ ఇండియన్ ప్లేయర్స్ తో పాటు ఎవత్ భారత అభిమానులందరికీ మింగుడు పడడం లేదు. ఇండియా మరోసారి వరల్డ్ కప్ తీసుకురావాలంటే 2027 వరకు వేచి చూడాల్సిందే. అప్పటికి ఇప్పుడు టీం లో ఉన్న వారు ఎంతమంది ఉంటారో ,ఎంతమంది ఊడతారో తెలియదు.
Also Read:ఆస్ట్రేలియా”తో వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా ఓడిపోవడానికి 10 కారణాలు ఇవే…ఆ స్ట్రాటజీ పని చేయలేదు.!