ప్రస్తుతం భారత్ లో 2023 ప్రపంచ కప్ సందడి మాములుగా లేదు. ఇప్పటికే భారత్ 9 మ్యాచ్ లు నెగ్గి సెమీఫైనల్స్ కి ఎంటర్ అయింది. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టి ఇండియాకి మరో వరల్డ్ కప్ అందిచాలని ఇండియన్ టీం అంతా కసిగా పనిచేస్తుంది.ఇప్పుడు సెమీఫైనల్ ముంగిట బీసీసీఐ పై యూకే కి చెందిన మీడియా సంస్థ సంచలన ఆరోపణలు చేసింది.

Video Advertisement

భారత స్పిన్నర్లకు అనుకూలించే పిచ్ మీదకు సెమీఫైనల్‌ను మారుస్తున్నారని ప్రచారం మొదలుపెట్టింది. మెగా టోర్నీలో వాడని పిచ్ మీద సెమీస్ నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన పిచ్ మీద నిర్వహించబోతున్నారంటూ ఓ కథనాన్ని వెలువరించింది.

అయితే ఇప్పటి వరకూ రెండు మ్యాచ్‌లు జరిగిన ఆ పిచ్ మీద స్పిన్నర్ల కేవలం 4 వికెట్లు పడగొట్టారు.వరల్డ్ కప్ 2023లో వరుసగా 9 విజయాలు సాధించిన భారత్ మంచి ఫామ్ లో కనబడుతుంది. నాకౌట్ పోరులో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా అమీతుమీ తేల్చుకోనుంది. అయితే సెమీఫైనల్‌లో తమకు అనుకూలించేలా పిచ్‌ను మార్చేసిందంటూ.. బీసీసీఐపై ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ భారత్ ఫైనల్ కి చేరితే.. అహ్మదాబాద్‌ లోని పిచ్ ను కూడా ఇదే తరహాలో స్పిన్‌కు అనుకూలంగా మార్చేసే అవకాశం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

vankade

నిజం చెప్పాలంటే వరల్డ్ కప్ లాంటి ఐసీసీ ఈవెంట్లలో గవర్నింగ్ బాడీ కన్సల్టెంట్ ఆండీ అట్కిన్సన్ పర్యవేక్షణలో మ్యాచ్ జరిగే పిచ్‌లను రూపొందిస్తారు. ప్రతి మ్యాచ్‌కు ముందు స్క్వేర్‌పై ఉన్న నంబర్‌ల స్ట్రిప్స్‌లో ఏది ఉపయోగించాలనే విషయమై బీసీసీఐతో ముందుగానే ఓ అంగీకారానికి వస్తాడు. అయితే టోర్నమెంట్ చివరకు చేరుకోవడంతో ఈ ఒప్పందాన్ని పక్కన పెట్టారని యూకేకు చెందిన డెయిలీ మెయిల్ ఆరోపించింది. భారత స్పిన్ బౌలర్ లకి అనుకూలించే విధంగా చూడటం కోసం.. ఇప్పటికే రెండుసార్లు ఉపయోగించిన పిచ్‌పై సెమీఫైనల్ జరగనుందని డెయిలీ మెయిల్ వెబ్‌సైట్ తన కథనంలో ప్రచురించింది.

namo stadium

బీసీసీఐ ఇలా పిచ్‌లను మార్చేస్తుండటంతో అట్కిన్సన్ ఫ్రస్టేషన్‌లో ఉన్నాడని… హోం నేషన్ బోర్డ్ లేదా టీమ్ మేనేజ్‌మెంట్ కోరినట్లుగా తయారు చేసిన పిచ్‌ ఉన్న మొట్టమొదటి ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ ఇదే అవుతుందని అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్‌ను ఉద్దేశించి లీకైన ఆయన మెయిల్‌ ద్వారా తెలిసిందని డెయిలీ మెయిల్ పేర్కొంది.

bcci pitch

కీలక మ్యాచ్ ముందు భారత్ ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టడంతోపాటు.. బీసీసీఐ పై దుష్ప్రచారం చేయడమనేది దీని ఉద్దేశంగా కనిపిస్తోంది. భారత్ గెలిస్తే.. తనకు అనుకూలమైన పిచ్‌లను ఎంపిక చేసుకొని గెలిచిందని ఆరోపించడం.. ఓడితే నచ్చిన పిచ్ ఎంపిక చేసుకోలేకపోవడం వల్ల ఓడిందని ప్రచారం చేయడమనేది దీని వెనకున్న ఉద్దేశంగా కనిపిస్తోంది.

 

Also Read:సెంచరీ చేశాక బ్యాట్స్‌మెన్ తన బ్యాట్ ని ఎందుకు పైకి ఎత్తుతాడు..? కారణం ఏంటంటే..?