టీం ఇండియాకి ఉన్న అతి పెద్ద టెన్షన్ ఇదేనా..? ఈ ఒక్క లోటు తీరితే కప్ కొట్టినట్టే..!

టీం ఇండియాకి ఉన్న అతి పెద్ద టెన్షన్ ఇదేనా..? ఈ ఒక్క లోటు తీరితే కప్ కొట్టినట్టే..!

by kavitha

Ads

ఐసీసీ ప్రపంచ కప్ లీగ్ స్టేజి లో ఓడితే మరో ఛాన్స్ ఉంటుంది.కానీ నాకౌట్ లో ఓడితే ఇంక ఆ టీం వారి ఇంటికి వెళ్లాల్సిందే. ప్రపంచ కప్ ఇంక ఆఖరి అంకంకి చేరుకుంది.లీగ్ మ్యాచుల సంఖ్య ఇంక మూడు ఉన్నాయి.ఆ తరువాత నాకౌట్ ఆటలు మొదలు అవుతాయి.అప్పుడే అసలైన మజా వస్తుంది.

Video Advertisement

అయితే..సెమి ఫైనల్ ఆటలు టీం ఇండియాకు అంట కలిసిరావడం లేదు.2011 నుంచి జరిగిన వన్ డే ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా మరియు కివీస్ చేతులలో 2015 , 2019 లో ఓడిపోయారు.ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లో టీమిండియా ఓటమి లేని జట్టుగా ఉంది.

ఆడిన 8 మ్యాచ్ ల్లోనూ విజయాలను సాధించి లీగ్ టాపర్ గా ఉంది. లీగ్ దశలో భారత్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది.అక్టోబర్ 12న నెదర్లాండ్స్ తో టీమిండియా తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లోనూ భారత్ నెగ్గితే ప్రపంచకప్ లీగ్ దశలో ఓటమి లేని జట్టుగా ఉంటుంది. ఓడినప్పటికీ పెద్ద నష్టం అయితే ఉండదు.

బ్యాటింగ్ లో ఇప్పటి వరకు కోహ్లీ, రోహిత్ శర్మలు మాత్రమే నిలకడగా రాణిస్తున్నారు. రోహిత్ అదిరిపోయే ఆరంభాల్ని అందిస్తుంటే.. మిడిలార్డర్ బాధ్యతల్ని కోహ్లీ తీసుకుంటున్నాడు. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలతో కలిసి కీలక భాగస్వామ్యాల్ని నిర్మిస్తున్నాడు.కానీ.. టీమిండియాను ఓ లోటు మాత్రం వేధిస్తుంది. హార్దిక్ పాండ్యా గాయంతో టీమిండియా కాంబినేషన్ పూర్తిగా మారిపోయింది. టీమిండియా ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు బౌలర్లు మాత్రమే బరిలోకి దిగుతుంది. హార్దిక్ తర్వాత టీమిండియాకు సరైన ఫినిష్ ఇచ్చే వారు కరువయ్యారు.

సరైన ఫినిషర్ లేకపోవడం టీమిండియాకు అతి పెద్ద సమస్యగా మారింది. హార్దిక్ ప్లేసులో జట్టులోకి చేరిన సూర్య కుమార్ యాదవ్ ఫినిషర్‍‌గా కొంచెం తడబడుతున్నాడు. ఈ మెగాటోర్నీలో మొత్తంగా నాలుగు మ్యాచ్‌లు ఆడిన 82 పరుగులు చేయగలిగాడు. సూర్య నుంచి ఇది సరిపోదు.ఆఖర్లో టీమిండియాకు సరైన బూస్ట్ ఇవ్వాలి. కాబట్టి సూర్యకుమార్ యాదవ్.. తన టీ20 స్కిల్స్ ఇక్కడ కూడా చూపిస్తే బాగుంటుంది. రవీంద్ర జడేజా ఫర్వాలేదన్పిస్తున్నా.. టీమిండియాకు డెత్ ఓవర్లలో సరైన ఫినిషింగ్ ఇచ్చే వారు కావాలి. మ్యాక్స్ వెల్, క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి ఆటగాడు మనకు కూడా ఉంటే టీమిండియాను ఆపడం ఎవరి తరం కాదు.

సెమి ఫైనల్స్ లోకి వచ్చిన నాలుగు టీమ్స్ లో ఒక విచిత్రం ఉంది. మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న ఇండియా,దక్షిణ ఆఫ్రికా,ఆస్ట్రేలియా,న్యూజిల్యాండ్ ఉన్నాయి.రెండవ స్తానం లో ఉన్న సౌత్ ఆఫ్రికా కేవలం ఇండియా తో ఓడిపోయింది. 3 వ స్తానం లో ఉన్న ఆస్ట్రేలియా మొదటి రెండు స్థానాలలో ఉన్న టీమ్స్ తో ఓడిపోయింది.4 వ స్తానం లో ఉన్న న్యూజిల్యాండ్ పై 3 స్థానంలో వారి తో మాత్రమే ఓడిపోయారు.


End of Article

You may also like