తెలుగు సీనియర్ హీరోయిన్ లు చాలామంది ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు. కొందరు సినిమాలు మానేసి కుటుంబ జీవితం గడుపుతూ ఉంటే మరి కొందరు ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా బతుకుతూ ఉంటారు. ఒక ప్రముఖ సీనియర్ హీరోయిన్ కూడా తన కెరీర్ లో హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.
తర్వాత మదర్ క్యారెక్టర్లు ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేసి ప్రేక్షకులకు ఎప్పుడూ దగ్గరగానే ఉన్నారు. ఇప్పుడు ఆమె డాన్స్ వీడియో ఒకటి ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది…. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా….?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రిగా పనిచేస్తున్న రోజా. అవును మీరు విన్నది నిజమే. రోజా హీరోయిన్ గా రిటైర్ అయిన తర్వాత అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షోలో ఆమె కనిపించేవారు. ఇప్పటికీ రోజా అందరికీ గుర్తున్నారంటే కారణం జబర్దస్త్ షోనే. ఆ షోలో ఆమె జడ్జిగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు స్కిట్ లలో నటిస్తూ స్టేజి పైన డ్యాన్సులు వేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు.అలాంటిది రోజా 23 సంవత్సరాల క్రితం పెర్ఫార్మ్ చేసిన ఒక డాన్స్ వీడియో ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో కనిపిస్తుంది.

కరు కరు కరుపాయ అనే తమిళ్ సాంగ్ కి రోజా ప్రభుదేవా తో కలిసి డాన్స్ వేశారు. అదే సాంగ్ కి ఒక ఈవెంట్ లో వేరే అతనితో కలిసి రోజా కాలు కదిపారు. ఇప్పుడు ఈ వీడియో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. రోజా ఎక్స్ప్రెషన్లు డ్యాన్స్ మూమెంట్లు భలేగా ఉన్నాయి. శేఖర్ మాస్టర్ తో కలిసి జబర్దస్త్ తో రోజా ఎన్నో పాటలకు డాన్స్ వేశారు. సినిమాలు వదిలేసి రాజకీయాల్లో బిజీ అయినా కూడా తనలో నటన ఆసక్తి, డాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏమాత్రం తగ్గలేదని రోజనిరూపిస్తూ ఉంటారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా చెప్పుకునే రోజా సినిమాల్లోకి వచ్చేసరికి తన చక్కటి నవ్వుతో ముచ్చటగా కనిపిస్తూ ఉంటారు.
Watch Video:







దీని తర్వాత అదిరింది షో లో కొంతకాలం స్కిట్ లు చేసిన ఆర్ పి ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రాంలో చేస్తున్నారు. జబర్దస్త్ మరియు ఇతర టీవీ షోలతో పోల్చిచూస్తే రెట్టింపు పారితోషికం దక్కుతుండడంతో ఈ షో మీద ఇతర స్టార్ కమెడియన్స్ కూడా ఆసక్తి కనబరచడం మనం చూస్తూనే ఉన్నాం.
అలాంటి ప్రముఖ కమెడియన్ ఓ ఇంటివాడు అయ్యారని తెలుస్తోంది. కిరాక్ ఆర్పి గా పేరు తెచ్చుకున్న ఈయన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆర్ పి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు లక్ష్మీ ప్రసన్న అని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు అని సమాచారం.
అయితే నిశ్చితార్థ వేడుకకు పలువురు ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ లు, ఆర్పీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరు అయ్యారని తెలుస్తోంది. కిరాక్ ఆర్పి జోడిని చూడటానికి చాలా చూడముచ్చటగా ఉన్నారని కామెంట్లు వస్తున్నాయి. అయితే పెళ్లికి సంబంధించి త్వరలో క్లారిటీ రానుందని తెలుస్తోంది. అయితే ఈ వేడుక హైదరాబాద్ లోని ప్రముఖ ఫంక్షన్ హాల్ లో జరిగినట్టు తెలుస్తోంది.














