Shweta Basu Prasad: శ్వేతా బసు ప్రసాద్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే.ఈ హీరోయిన్ ‘కొత్త బంగారులోకం’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అమాయకత్వంతో కూడిన పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ సినిమాలో శ్వేత బసు ప్రసాద్ ఎకడా అంటూ, తన అల్లరి చేష్టలతో గుర్తుండిపోయేలా నటించింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. శ్వేతా బసుకు వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ అవన్నీ ప్లాప్ అవడంతో, పాపులారిటీ ఎంత తక్కువ టైమ్ లో సంపాదించుకుందో, అంతే ఫాస్ట్ గా ఫేడ్ అవుట్ అయిపోయింది. శ్వేతా బసు చైల్డ్ యాక్టర్ గా హిందీ, బెంగాలీ సినిమాలలో నటించింది. అక్కడ పేరు సంపాదించింది.
బాలనటిగా శ్వేత బసు మొదటి హిందీ సినిమా ‘మక్డీ’ లో డబుల్ రోల్ చేసి అలరించిడమే కాక, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న సమయంలో శ్వేత బసుకు జరిగిన ఒక ఇన్సిడెంట్ అప్పట్లో అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఆ సంఘటన ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అది జరిగిన తరువాత ఆమె బాలీవుడ్ కి వెళ్ళింది. అక్కడే ఉంటూ హిందీలో సీరియల్స్ లో నటిస్తూ, ఇంకో వైపు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేసింది. శ్వేత బసు డిసెంబర్ 2018 లో ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ ని వివాహం చేసుకుంది.కానీ ఏం జరిగిందో కానీ ఏడాదికే విడిపోయారు.
అయితే ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్టుంది. అందుకేనేమో ఇటీవల హాట్ ఫోటో షూట్లను షేర్ చేస్తూ, ఇన్‌స్టాలో హీట్ పెంచుతోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే సంపాదించింది. తాజాగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కోసం గోవా వెళ్లిన శ్వేత బసు బీచ్‌లో సందడి చేసింది. ‘ఇండియా లాక్డౌన్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మరియు ప్రమోషన్స్‌లోనూ అందాల ఆరబోతతో రచ్చ లేపింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్వేత బసును ఇన్‌స్టాగ్రామ్‌లో 440K ఫాలో అవుతున్నారు.

ఇక చెన్నై బ్యూటి త్రిష ఇండస్ట్రీకి ఇచ్చి ఇరవైమూడు ఏళ్లు గడుస్తున్నా వన్నె తరగని అందంతో ఇంకా నటిస్తూనే ఉంది. హీరోయిన్స్ పది ఏళ్లలోనే పరిశ్రమ నుండి ఫేడ్ అవుట్ అయ్యే రోజుల్లో కూడా 23 ఏళ్లుగా అగ్ర నటిగా నిలదొక్కుకున్న ఘనత త్రిషాకే దక్కింది. ఆ మధ్య సరైన హిట్స్ లేక కాస్త వెనక్కి తగ్గిన ఆమె ps-1 సినిమాతో కమ్‌బ్యాక్ అయ్యింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా త్రిష కెరీర్‌ను మళ్ళీ మలుపు తిప్పింది. కుందవై యువరాణి పాత్రలో అద్భుతంగా నటించి మ్యాజిక్ చేసింది.
ఇక అసలు విషయంలోకి వస్తే త్రిష, ప్రకాష్ రాజ్ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.కానీ ఒకే హీరోయిన్ కి లవర్ గా, మామగా, నాన్నగా, అన్నగా ఇలా అన్ని పాత్రల్లోనూ చేసిన ఒకే ఒక నటుడు ప్రకాష్ రాజ్, ఆ హీరోయిన్ త్రిష. ఇలా వీరు నటించిన ఆ సినిమాల్లో వీరిద్దరూ పోటీ పడి నటించారు. ఆ ఘనత విరిద్దరికే దక్కుతుంది. ఆకాశమంతా సినిమాలో తండ్రి కూతుర్లుగా జీవించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో త్రిష ప్రేమించిన అబ్బాయి తండ్రిగా, కాబోయే కోడలికి మంచితనం గుర్తించే మామగా, సైనికుడు సినిమాలో విలన్ బావమరిదిగా, త్రిషకి వరుసకి అన్నగా చేసాడు.
తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన గిల్లీ సినిమా,ఇది తెలుగులో మహేశ్ ‘ఒక్కడు’ సినిమాకి రీమేక్. ఇక్కడ హీరోయిన్ గా భూమిక నటించగా, తమిళ్ లో త్రిష నటించింది.త్రిషను ప్రేమించే విలన్ గా రెండు చోట్లా ప్రకాష్ రాజ్ నటించాడు. ఇలా తండ్రీ కూతుళ్లు గా, నాయికా ప్రతినాయకులుగా ఎలా కనిపించినా కూడా ప్రకాశ్‌రాజ్, త్రిష కాంబోను ఇటు తెలుగు ఆడియెన్స్ , అటు తమిళ ఆడియెన్స్ ఆదరించారు. తాజాగా వీరిద్దరు ముఖ్య పాత్రలు పోషించిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’సూపర్ హిట్ అయ్యింది.
అక్కడితో ఆగకుండా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేయడం కోసం సతీమణి నమ్రత సహకారంతో వివిధ బిజినెస్ లను మొదలుపెట్టాడు. సూపర్ స్టార్ రియల్ బిజినెస్ మేన్ గా కూడా ప్రూవ్ చేసుకుంటున్నాడు. సినిమాల్లో సంపాదించిన డబ్బును బిజినెస్ లకు ఉపయోగిస్తూ, మిగతా వారికంటే వినూత్నంగా ముందుకెళ్తున్నాడు. ఇక మహేష్ వ్యాపారాలు ఏమిటో చూద్దాం..
#1 జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్..
#2 ఏఎంబీ సినిమాస్..
#3 ది హంబుల్ కో..
#4 AN రెస్టారెంట్..

ఈ కార్యక్రమానికి రమేష్ బాబు భార్య, పిల్లలు వచ్చారు. కృష్ణ సంతాప సభలో, చిన్న కర్మ కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. కృష్ణ ఫోటో వద్ద పూలు ఉంచి నివాళులర్పించారు. వీరితో మహేష్ బాబు దిగిన ఫోటోలు సోషల్ మెడీఏఆలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో రమేష్ బాబు కూతురుకు సంబంధించిన మరి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చాయి. ఈ ఫోటోల్లో చూడటానికి ఎంతో అందంగా, గ్లామరస్ గా కనిపిస్తోంది రమేష్ బాబు కూతురు sభారతి. ఈ ఫోటోలు చూసిన వారు సోషల్ మీడియా వేదికగా అనేక కామెంట్లు పెడుతున్నారు.
అయితే కృష్ణ వారసులుగా రమేష్ బాబు మరియు మహేష్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరిలో మహేష్ బాబు స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. రమేష్ బాబు నటుడిగా సినిమాలు చేసినప్పటికి విజయం పొందలేకపోయాడు. రమేష్ బాబు ఫ్యామిలీ గురించి కానీ అతని పర్సనల్ విషయాల గురించి గానీ చాలా మందికి తెలియదు. రమేష్ బాబు భార్య పేరు మృదుల, కొడుకు పేరు జయకృష్ణ కాగా కూతురు పేరు భారతి. వీరి గురించి ఎక్కువగా ఎవరికి తెలియదు. ఎందుకంటే రమేష్ బాబు భార్య కానీ, పిల్లలు కానీ సినిమా ఫంక్షన్లలో ఎక్కువగా కనిపించేవారు కాదు.
రాజమౌళి మహేష్‌బాబుతో మూవీని అనౌన్స్ చేసి చాలా రోజులు అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కేఎల్ నారాయణ నిర్మాణంలో రాబోతుంది. అయితే త్రివిక్రమ్ మూవీ పూర్తయిన తరువాత ఈ సినిమాను మొదలుపెడతారు. అంటే ఈ సినిమా 2023 చివరలో మొదలు అవుతుందని అనుకుంటున్నారు. రాజమౌళి ఈ సినిమా గురించి తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.ఈ మూవీ కోసం మహేష్ బాబు లుక్‌లో మార్పులు చేయడం లేదని రాజమౌళి కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
‘ఇండియానా జోన్స్’ లాంటి మూవీ చేయాలని ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నానని, అడ్వంచరస్ కథల్లో మహేష్ కనిపిస్తే బాగుంటుంది. ఎప్పట్నుంచో అలాంటి ఆలోచన ఉందని, అలాంటి మూవీ చేయడానికి ఇదే సరైన సమయం. అందుకే మహేష్ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ అడ్వంచరస్ మూవీగా తీయాలని అనుకుంటున్నానని అన్నారు. ఈ సినిమాకు మహేష్ ఇప్పుడున్న లుక్ సరిపోతుందని జక్కన్న భావిస్తున్నారని సమాచారం.
హీరో నితిన్ ఒక్క లుక్ తో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని హింట్ ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్లో హీరో నితిన్ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు వంశీ అండ్ టీం. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన పెండ్లిసందడి ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.
మాచర్ల నియోజకవర్గం సినిమా నితిన్‌కి ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. దీంతో నితిన్ ఈసారి మంచి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడని ఫ్రెష్ లుక్ తో చెబుతున్నాడు.నితిన్ ఈ చిత్రంలో మాస్ అవతార్‌లో కనిపించబోతున్నాడని అర్థమవుతోంది.అయితే ఈ సినిమాలో ఒక్క ఎపిసోడ్ నే ఇలా కనిపిస్తాడని, సినిమా కథ వేరని సమాచారం. నితిన్ ఒక్క సన్నివేశం కోసమే గెడ్డం పెంచాడని టాక్ వినపడుతోంది. కొన్ని రోజులు అడవుల్లో తొలి షెడ్యూలు పూర్తి చేసి, ఆ తరువాత షూటింగ్ ని హైదరాబాద్ కు షిప్ట్ చేస్తారని, ఈ గెటప్, ఈ సీన్ కు, మిగిలిన కథకు ఉన్న సంబంధం ఏమిటో తెలియాల్సి వుంది. ఈ సినిమాకు సంగీతం హారిస్ జయరాజ్ అందిస్తున్నారు.
సినిమాల ద్వారా ఎంతో పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న నయనతార ఇటీవల తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని వివాహం చేసుకుంది.పెళ్లి అయిన నెలకే సరోగసి ద్వారా తల్లి అయ్యి వార్తల్లో నిలిచింది. నయన్ ఆస్తుల విలువ దాదాపు రూ. 100 కోట్లు అని అంచనా. దక్షిణ భారతదేశంలోని అత్యంత ధనిక హీరోయిన్స్ లో ఒకరు. ఆమెకు చెన్నైలో విలాసవంతమైన విల్లాలు, అపార్ట్మెంట్లు, విలాసవంతమైన కార్లు మరియు ప్రైవేట్ జెట్ కూడా ఉన్నాయి.
నయనతారకు ఉన్న 8 ఖరీదైన వస్తువుల జాబితా ఏంటో చూద్దాం..
2. విలువైన ఆస్తులు
3.కాస్మెటిక్ బ్రాండ్ ‘ది లిప్ బామ్ కంపెనీ’
4. ప్రైవేట్ జెట్
5. మెర్సిడెస్ GLS 350D
6.BMW 7-సిరీస్ ధర రూ. 1.76 కోట్లు
7.టయోటా ఇన్నోవా క్రిస్టా విలువ రూ. 30 లక్షలు
8. రూ. 74.50 లక్షల విలువైన BMW 5 సిరీస్
ప్రస్తుతం టాలీవుడ్లో కృష్ణ కుటుంబం నుండి ముగ్గురు ఉన్నారు. ఒకరు మహేష్ బాబు, మరొకరు సుధీర్ బాబు మరియు గల్లా అశోక్. కృష్ణ జీవించి ఉండగానే హీరో సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు గల్లా అశోక్. అలాగే కృష్ణ కూతురు ప్రియదర్శిని పెళ్లి చేసుకున్న సుధీర్ బాబు కూడా సినిమాల పై ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ తేజ దర్శకత్వంలో నటించిన నిజం సినిమా మనం అంతా ఈజిగా మారిచిపోలేం. ఈ సినిమాలో మహేష్ బాబు నటనకు ప్రశంసలతో పాటు నంది అవార్డ్ కూడా దక్కాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టార్టింగ్‌లో ‘చందమామ రావే’ అంటూ ఓ పాట ఉంది.
టైటిల్ సమయంలో వచ్చే ఈ పాటలో ఓ తల్లి తన బిడ్డకు చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తోంది. ఆ అబ్బాయి ఎవరో కాదు మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయ కృష్ణ. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కృష్ణ చిన్న కర్మనాడు ఆ విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే రమేష్ బాబు తనయుడు జయకృష్ణ సినిమా రంగప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. కృష్ణ ప్రోత్సాహం మేరకు అమెరికా వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నాడు. కృష్ణ చనిపోయిన తర్వాత జయకృష్ణ ఆయన్ను చూసేందుకు కూడా రాలేకపోయారు. అమెరికా నుండి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది.
ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్న ఆయనతో కలిసి మహేష్ బాబు దిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జయకృష్ణను మహేష్ బాబు స్వయంగా లాంచ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కృష్ణ లేకపోవడంతో అన్నయ్య రమేష్ బాబు కుటుంబ బాధ్యతలను మహేష్ బాబు చూసుకుంటాడని అంటున్నారు. ఆ ఫోటోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
పూజా హెగ్డే పాన్-ఇండియా సినిమాలతో భారతీయ చిత్రసీమలో స్టార్ హీరోయిన్. పూజా హెగ్డే సినిమాల నుండి, ఎండార్స్మెంట్ల నుండి భారీగా సంపాదీస్తోంది. పూజా హెగ్డే ఆస్తుల విలువ సుమారుగా 50 కోట్లు. ఆమెకు ఖరీదైన కార్లు, హ్యాండ్‌బ్యాగులు సేకరించే అభిరుచి ఉంది.ఇక పూజా హెగ్డే లగ్జీరియస్ లైఫ్ గురించి, ఆమె దగ్గరున్న విలువైన 9 ఖరీదైన వస్తువులు ఏమిటో ఇక్కడ చూద్దాం..
2. హైదరాబాద్‌లో రూ. 5 కోట్ల విలువైన ఇల్లు తీసుకుంది.
3. ముంబైలోని బాంద్రాలో సముద్రం వైపు వ్యూ ఉండే అపార్ట్మెంట్ తీసుకుంది.దీని విలువ రూ. 6-8 కోట్లు
5. బుట్టబొమ్మ వద్ద రూ. 80 లక్షల విలువైన BMW 350d కారు ఉంది.
6. ఆమె దగ్గరున్న ఆడి క్యూ7 విలువ రూ. 85 లక్షలు.
7. పూజా హెగ్డే దగ్గర క్రిస్టియన్ డియర్ హ్యాండ్ బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్ విలువ రూ. 1.3 లక్షలు
8. లూయిస్ విట్టన్ క్రోయిసెట్ హ్యాండ్ బ్యాగ్ విలువ రూ. 1.4 లక్షలు.
9. లూయిస్ విట్టన్ వైట్ హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 1.91 లక్షలు
ప్రభుదేవా ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్ళి, అక్కడ స్టార్ హీరోలతో వరుస మూవీస్ చేస్తూ బిజీ డైరెక్టర్‌గా అయ్యాడు. ప్రభుదేవా ఎక్కువగా తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందుకున్నారు. ప్రస్తుతం మరోసారి నటుడిగా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక డైరెక్టర్ గా మారిన తర్వాత ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌గా కొనసాగలేదు. ఒకరిద్దరు స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేసారు.
తాజాగా ప్రభుదేవా గురించిన ఒక పోస్ట్ పై సోషల్ మీడియాలో పై చర్చ జరుగుతోంది. ఇంతకి ఆ పోస్ట్ లో ఏముంది అంటే ప్రభుదేవా ఇంస్టాగ్రామ్ అఫిసియల్ అకౌంట్ మరియు ప్రభుదేవా ఫ్యాన్స్ అకౌంటు ఫోటోలను కలిపి పెట్టారు. అయితే ప్రభుదేవాకి 380k ఫాలోవర్స్ ఉండగా, ప్రభుదేవా ఫ్యాన్స్ అకౌంటుకి 473k ఫాలోవర్స్ ఉన్నారు. పెట్టిన కొన్ని గంటల్లోనే పోస్ట్ కి 14 k లైక్స్ వచ్చాయి. దీంతో ఆ పోస్ట్ పై నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ అక్కౌంట్లో ఎక్కువ పోస్టులు పెడుతున్నారు కాబట్టి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారని కామెంట్ చేస్తే, మరి కొంతమంది ఫ్యాన్స్ తో మామూలుగా ఉండదు మరి అంటున్నారు.