మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి నవంబర్ ఒకటో తారీఖున ఇటలీలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా ఇటలీకి పైనమయ్యారు. మూడు రోజులు పాటు జరిగే ఈవెంట్ లో అందరూ సరదాగా గడపనున్నారు. హల్దీ ఫంక్షన్, వెడ్డింగ్ సెర్మని, మెహందీ ఫంక్షన్ అంటూ ఈవెంట్లను చేయనున్నారు.
ఇప్పటికే ఇటలీలో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న లావణ్య-వరుణ్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరి పెళ్లి కారణంగా మూడు సినిమాలు ఆగిపోయాయి అన్న వార్త వినిపిస్తుంది. అసలు ఏంటా సినిమాలు? ఎందుకు ఆగాయి?

వరుణ్ తేజ్ పెళ్లి కారణంగా రామ్ చరణ్ ఇటలీ వెళ్ళాడు. వారం రోజులపాటు అక్కడే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాడు. అయితే నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్ షూటింగ్ కూడా ఇదే టైంలో జరగాల్సి ఉంది కానీ చరణ్ లేకపోవడంతో షూటింగ్ క్యాన్సిల్ అయింది. శంకర్ కూడా ఇండియన్ 2 షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చి గేమ్ చేంజర్ షుటింగ్ కోసం హైదరాబాద్ రావాలని అనుకున్నాడు. రామ్ చరణ్ లేని కారణంగా గేమ్ చేంజెర్ మరో నెల రోజులు లేట్ అవుతుంది.

ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప2 సినిమాకి బ్రేక్ ఇచ్చి వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీ వెళ్ళాడు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అల్లు అర్జున్ లేని కారణంగా వాయిదా పడింది.ఇక పవన్ కళ్యాణ్ కూడా తన కుటుంబంతో ఇటలీలోనే ఉండగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా కూడా బ్రేక్ పడినట్లు సమాచారం.మళ్లీ వీరందరూ పెళ్లి తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చాకే షూటింగు ప్రారంభం కానున్నాయి.
Also Read: OG సినిమాలో ఇంకో హీరోనా… ఎవరతను?

కాగా ఇటీవల ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో రిలీజ్ అయ్యి, అక్కడ భారీ వసూళ్లు రాబడుతోంది. జపాన్ లో  RRR సినిమా రాబడుతున్న కలెక్షన్స్ తో  లెక్కలు మొత్తం మారిపోయాయి. ఈ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా టాప్ ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక జపాన్ లో RRR  రిలీజ్ కు ముందు వరకు కేజీఎఫ్ 2 సినిమానే 2022లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమాగా ఉంది.
కానీ ఇప్పుడు జపాన్ ప్రేక్షకుల వల్ల రాజమౌళి  సినిమాకి ఆ రికార్డు దక్కింది. అయితే ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ  1200 కోట్ల కలెక్షన్స్ తెచ్చిందని తెలుస్తోంది. కాగా కేజీఎఫ్ 2 సినిమా  1200 కోట్లకు దగ్గరగా  ఉన్నట్లు సమాచారం. అయితే కొంచెం తేడాతోనే ఆర్ ఆర్ ఆర్ టాప్ ప్లేస్ ను దక్కించుకుంది.ఇక కేజీఎఫ్ 2 సినిమా రెండవ స్థానంలో ఉంది.
ఈ సినిమా పదకొండు వందలకోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అంతే కాకుండా గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపిక అయ్యింది. రాజమౌళి కూడా హాలీవుడ్లో గవర్నర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం లాంటి అరుదైన గౌరవాలు దక్కాయి. అయితే గత నెలలో ‘ఆర్ఆర్ఆర్’గ్రాండ్గా జపాన్ లో విడుదల అయ్యింది. ఈ క్రమంలో అక్కడ ‘ఆర్ఆర్ఆర్’ మరో ఫీట్ సాధించింది. బాహుబలి’ రికార్డ్స్ ని బీట్ చేసి, అక్కడ అత్యధిక కలెక్షన్లు సాధించిన 2వ ఇండియాన్ సినిమాగా నిలిచింది.
ఇదే కాకుండా అత్యంత వేగంగా మూడు వందల మిలియన్ల క్లబ్లో చేరిన ఫస్ట్ భారతీయ సినిమాగా నిలిచి,రెండవ స్థానంలో ఉన్న బాహుబలి 2 ని వెనక్కి పంపింది. జపాన్లో విడుదలైన 34 రోజుల్లోనే అక్కడి కరెన్సీలో 305 మిలియన్ల యెన్లు వసూల్ చేసింది. అంటే మన కరెన్సీలో రూ.17.9 కోట్లు. అయితే 27 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘ముత్తు’ సినిమా విడుదలై రూ.23.5 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ అదే సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియాన్ సినిమాగా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. జపాన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇన్ని ఏళ్లు గడిచిన ఆ రికార్డ్ రజినీ కాంత్ పేరిటే ఉందంటేనే తెలుస్తోంది. ముత్తు సినిమా తరువాత రెండో స్థానంలో నిలిచింది ఆర్ఆర్ఆర్.
ఇక జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో వచ్చే ఏడాది హాలీవుడ్ లేవల్లో అడ్వంచర్ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్స్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ మూవీ కోసం ప్రిపేర్ సిద్ధం అవుతుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ లో ఉన్నాడు.


మొదటి నుంచి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న కొరటాల శివ చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఆచార్య డిజాస్టర్ గా నిలిచింది. ఇందులో ముఖ్యమైన పాత్ర రామ్ చరణ్ కాబట్టి కొరటాల శివ కూడా బోయపాటి తరహాలోనే రామ్ చరణ్ తో చేసి బోల్తా పడ్డారని గుసగుసలు మొదలయ్యాయి.



