తల్లికి పెళ్లి చేసిన కూతురు…30 ఏళ్ల తర్వాత తల్లి ప్రేమను గెలిపించింది.!! రియల్ స్టోరీ!!!

తల్లికి పెళ్లి చేసిన కూతురు…30 ఏళ్ల తర్వాత తల్లి ప్రేమను గెలిపించింది.!! రియల్ స్టోరీ!!!

by Anudeep

Ads

తల్లి ప్రేమించిన వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేసిన కూతురు.. వినడానికి సినిమా కథలా అనిపించినా , ఇదే నిజం.. మన సొసైటీలో మగవాళ్ల ప్రేమలు, రెండో పెళ్లిల్లకు సంబంధించి పెద్దగా ఆంక్షలుండవు, కాని అదే ఆడవాళ్లు, అందునా వయసు పైబడిన వారు తోడు కోరుకుంటే చాలా వింతగా చూస్తుంది సమాజం..కాని అలాంటి సమాజపు కట్టుబాట్లను కాదని ఒక కూతురు స్వయంగా తన తల్లికి పెళ్లి చేసిన ఘటన కేరళలో చోటుచేసుకుంది.

Video Advertisement

అమ్మ , నాకు అతని గురించి చెప్పింది, తన ప్రేమ కథ చెప్పింది. వెంటనే  అతన్ని కలవాలనుకున్నాను. నాకు ఆ రోజు నిద్రపట్టలేదు.. ఎప్పుడెప్పుడు వెళ్లి అతన్ని కలుస్తానా? అని ఎదురు చూసాను..మరుసటి రోజునే లేచి స్వస్థలానికి వెళ్లి అతన్ని కలిసాను..చాలా మాట్లాడాను, ఇన్నేళ్లకి నన్ను చూసిన అతను కన్నీళ్లు పెట్టుకున్నారు.నాకు కూడా ఏడుపాగలేదు..వెంటనే అమ్మతో తన పెళ్లి విషయం మాట్లాడాను..దానికి అతను ఒప్పుకోలేదు.. అంటూ తన తల్లి ప్రేమ కథ గురించి , అతన్ని తను కలిసిన రోజు గురించి ఫేస్ బుక్లో పోస్టు చేసింది అథీరా..

అథీరా, తల్లి అనిత తను యుక్త వయసులో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించింది..అతడే విక్రమన్.. కానీ అనిత తండ్రి వారిద్దరి ప్రేమని అంగీకరించలేదు.దాంతో అనిత తన ప్రేమని మర్చిపోయి తండ్రి చూసిన వరున్ని పెళ్లి చేసుకుంది.. ఇద్దరు అమ్మాయిలు పుట్టారు.ఇంతలో భర్త మరణించాడు. అప్పటి నుండి పిల్లలిద్దరిని తనే పెంచి పెద్ద చేసింది. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది..తల్లి తమకు పంచిన ప్రేమ, తను జీవితంలో పడిన కష్టాలను దగ్గరుండి చూసిన అథీరా తన తల్లి ముఖంలో సంతోషం చూడాలనుకుంది, ఈ ఏజ్ లో తనకొక తోడు అవసరం అని భావించింది.

ఒకరోజు మాటల మద్యలో తల్లి తన ప్రేమకథ చెప్పడంతో, విక్రమన్ దగ్గరకు వెళ్లి , తన తల్లిని పెళ్లి చేసుకోమని అడిగింది.. ముందు నువ్వు పెళ్లిచేసుకుంటేనే తమ పెళ్లి గురించి ఆలోచిస్తా అని విక్రమన్ అనడంతో సరే అని తన పెళ్లికి ఒప్పుకుని, తన పెళ్లిలో తండ్రి స్థానంలో ఉండాలని కోరింది.. అథీరా పెళ్లి జరిగిన వారం రోజుల తర్వాత తన తల్లిని, విక్రమన్ ని ఒకటి చేశారు ఆ అక్కాచెల్లెల్లు.

ఇది జరిగి నేటికి నాలుగేళ్లు..ఇప్పటికి వారు సంతోషంగా ఉన్నారు.తన తల్లి సంతోషాన్ని తిరిగి తెచ్చిన ఆ అక్కాచెల్లెల్లు వారి వారి కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు.. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రేమ విఫలమైన తర్వాత విక్రమన్ పెళ్లి చేసుకోలేదు.. ఇన్నేళ్ల తర్వాత వారి ప్రేమ విజయవంతమైంది..నిజాయితిగా ప్రేమిస్తే ఎప్పటికైనా గెలుపు తద్యం అని నిరూపించింది ఈ కథ..

Image Source: Facebook


End of Article

You may also like