కుటుంబం మొత్తం కరోనా కాటుకి బలి.. అనాథలైన కవల పిల్లలు.. వీరి కథ వింటే కన్నీళ్లే..!

కుటుంబం మొత్తం కరోనా కాటుకి బలి.. అనాథలైన కవల పిల్లలు.. వీరి కథ వింటే కన్నీళ్లే..!

by Anudeep

Ads

కరోనా మహమ్మారి అంతకంతకు వ్యాపిస్తూనే ఉంది.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ మహమ్మారి వదలడం లేదు. ఈ మహమ్మారి సోకడం వలన ఎందరో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎందరో పిల్లలు అనాధలవుతున్నారు. మరెందరో తల్లితండ్రులు పిల్లలను పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలానికి చెందిన ఓ కుటుంబం లో కరోనా మహమ్మారి తీవ్ర విషాదం మిగిల్చింది.

Video Advertisement

teachers family

పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం తాళ్ళకట్టు పల్లి లో నివాసం ఉంటున్న ఉపాధ్యాయిని నాగ దుర్గ కుటుంబం లో ఈ ఘోరం చోటు చేసుకుంది. నాగ దుర్గ కుక్కునూరు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు గా పని చేస్తున్నారు. ఆమె భర్త రమేష్ గ్రామ సచివాలయ ఉద్యోగి గా పని చేస్తున్నారు. వీరికి పెళ్లి అయిన చాలా కాలం తరువాత కవలలు నిహాల్, నిఖిల్ లు జన్మించారు. అంతా సవ్యం గా ఉందన్న తరుణం లో గత సంవత్సరం రమేష్ తల్లి కరోనా తో మరణించారు.

corona deaths

ఆ తరువాత నాలుగు రోజులకే రమేష్ కూడా కరోనా కారణం గా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీనితో నాగ దుర్గ తీవ్ర మనస్తాపానికి గురి అయ్యారు. భర్త, అత్తా ఇద్దరు మరణించడం తో.. ఆమె బుట్టాయగూడెం ను వదిలేసి కుక్కునూరు కు వచ్చి ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె పిల్లలు ఒకటవ తరగతి చదువుతున్నారు. ఇటీవలే ఆమెకు కూడా కరోనా సోకింది. ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటూ గత శుక్రవారమే మృతి చెందింది. ఆ పిల్లలిద్దరూ ప్రస్తుతం అనాథలయ్యారు.


End of Article

You may also like