టీ20 మ్యాచ్లు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇక సెమీ ఫైన్లస్ జరగాలి. కానీ టీమిండియాకు ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ల కి ముందు గాయాలు అవ్వడం అందరినీ టెన్షన్ పెడుతోంది. అసలు ఇంతకీ ఏమైనదంటే.. గురువారం అడిలైడ్‌లో సెమిస్ కోసం ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.

Video Advertisement

అయితే ఆ ప్రాక్టీస్ లో టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేతి కి దెబ్బ తగిలింది. ఇది అందరినీ భయ పెట్టేసింది. సెమిస్ కి ముందు ఇలా జరిగితే అది ఆట మీద ఎఫెక్ట్ కావచ్చు.

నెట్స్‌ లో రోహిత్ ప్రాక్టీస్ చేస్తుండగా తన రైట్ హ్యాండ్ కి దెబ్బ తగిలింది. అయితే ఇలా రోహిత్ శర్మ చేతి కి దెబ్బ తగలడం తో ప్రాక్టీస్ ని ఆపేసాడు రోహిత్. చేతి కి బంతి తగలగానే నొప్పి వచ్చేసింది. దానితో ప్రాక్టీస్ ని ఆపేసి నెట్స్ నుంచి బయటకు వెంటనే వచ్చేసాడు హిట్ మ్యాన్.

టీమ్ ఫిజియో వచ్చి చేతిని పరీక్షించాడు. కానీ ఈ గాయంపై బీసీసీఐ ఏమి చెప్పలేదు. కానీ గాయమైన కొంచెం సేపటికి రోహిత్ మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసాడు. ఇంకేం వుంది అందరికీ రిలీఫ్ వచ్చింది. దీనితో ఏ ప్రమాదం లేదని.. ఆట ఆడగలడని తెలుస్తోంది. రోహిత్ శర్మ చేతి కి దెబ్బ తగలడం.. ప్రాక్టీస్ ని ఆపేసి నెట్స్ నుంచి బయటకు వెంటనే రావడం.. మళ్ళీ రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా లో షికార్లు కొడుతోంది.