2023 వన్డే ప్రపంచ కప్ టోర్నీ ముగిసిపోయింది. అందులో భారత్ చివరిదాకా ఊరించి ఓటమిపాలైంది. భారత అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ప్లేయర్లు కూడా నిరాశ చెంది ప్రస్తుతం ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్లిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అన్న ప్రశ్న వేధిస్తుంది. దీనికి తగ్గట్టు బిసిసిఐ ఏం చర్యలు తీసుకుంటుంది ఫైనల్లో జరిగిన లోపాలను సరిదిద్దేందుకు ఎటువంటి ప్రణాలికలు రూపొందిస్తుంది.

Video Advertisement

ప్రపంచ కప్ లాంటి పెద్ద టోర్నీ ల ముందు ఐపీఎల్ ఆడించడం ఎంతవరకు సబబు అని విమర్శలు కూడా వస్తున్నాయి. లోపాలపై దృష్టి సారించిన ఆస్ట్రేలియా ప్రపంచ విజేత అయింది. అయ్యిందేదో అయ్యింది. రాబోయే 2027 వరల్డ్ కప్ కి భారత్ ఇప్పటినుండి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి.

1.స్పిన్ కి భయపడుతున్న మన బ్యాటర్లు:

bharat fans fire on KL Rahul..know why..

భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ బాగా ఆడతారని ప్రసిద్ధి. దానికి తగ్గట్టుగానే మన వాళ్ళ ప్రదర్శన కూడా ఉండేది. అయితే విదేశాల్లో ఉపయోగపడుతుంది అని పేస్ పిచ్ ల పైన ప్రాక్టీస్ మొదలుపెట్టారు. దానివల్ల స్పిన్ కి దూరమయ్యారు. ఈ ప్రపంచ కప్ లో పార్ట్ టైం స్పినర్ల బౌలింగ్ లో కూడా ఆడడానికి ఇబ్బంది పడ్డారు.

2.లెఫ్ట్ హ్యాండర్స్:

ravindra jadeja denies rumors about his test retirement

దూకుడు మీదున్న బ్యాటర్లను అడ్డుకోవాలంటే బౌలింగ్ లో వైవిధ్యం కావాలి. మన భారత్ తరఫున ప్రపంచకప్ ఆడిన పేసర్లు అందరూ కూడా రైట్ హ్యాండ్ వాళ్లే. మిగతా ఏ టీం చూసుకున్నా ఒక్కరైనా లెఫ్ట్ హ్యాండ్ పేసర్ ఉన్నాడు.మనకి ఆ లోటు కనిపించింది. హర్ష్ దీప్ సింగ్,నటరాజన్, చేతన్ సకారియ లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళని పదును పెట్టాలి.బ్యాటింగ్ లో చూసుకున్న జడేజా తప్పిస్తే ఎవరు కనబడడం లేదు. బ్యాటింగ్ లో కూడా వైవిధ్యం కావాలి. ఇషాన్ కిషన్,రింకు సింగ్ , శివమ్ దుబే,రిషబ్ పంత్ లాంటి వాళ్ళు కనిపిస్తున్నారు.

3. షార్ట్ బాల్స్:

ఎంతటి మేటి బ్యాట్స్ మెన్ అయినా కూడా ఏదో ఒక బలహీనత ఉంటుంది. మన స్టార్ బ్యాటర్ లను ప్రత్యర్థులు ఆ బలహీనత మీద కొట్టి ఔట్ చేస్తున్నారు. శ్రేయస్ ను షార్ట్ బాల్ వేసి ఔట్ చేస్తే, గిల్ ను అనుభవం లేమీతో ఇబ్బంది పెడుతున్నారు.

4.పేస్ అల్రౌండర్:

ప్రస్తుతం టీం లో హార్దిక్ పాండ్యా ఒక్కడే పేస్ ఆల్ రౌండర్ ఉన్నాడు. ఈ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది భారత్ టీం ఏ స్థాయిలో ఉందో.అతనికి ఆల్టర్నేటివ్ కూడా ఎవరూ లేరు. ఆస్ట్రేలియా లాంటి టీమ్ లో పాట్ కమిన్స్ ,స్టార్క్ లాంటి వారు బౌలింగ్ తో అదరగొడుతూనే బ్యాటింగ్ లో కూడా విజృంభిస్తున్నారు.

5.పార్ట్ టైమర్స్:

ఏ జట్టులోనైనా పార్ట్ టైమర్స్ ఉంటే అది బాగా కలిసి వస్తుంది. గతంలో సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ బాగా ప్రదర్శించేవారు. ప్రస్తుతం జట్టులో పార్ట్ టైమర్లు ఎవరూ లేరు. నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో తప్ప ఎక్కడ కూడా పార్ట్ టైమర్స్ తో బౌలింగ్ చేయించింది లేదు. పార్టీ టైమర్ ఉంటే ఆల్ రౌండర్ లేని ఒత్తిడి కాస్త తగ్గుతుంది.

6. కుర్రాళ్లను పదును పెట్టాలి:

మళ్లీ 2027 లో ప్రపంచ కప్ ఉంది.ఇప్పుడు టీం లో ఉన్నవారు అప్పటికి ఎంతమంది ఉంటారో తెలియదు. ప్రస్తుతం ఉన్న కుర్రాళ్లను అప్పటికి సాన పెట్టాలి. శుభమన్ గిల్ , శ్రేయస్ అయ్యర్,ఇషాన్ కిషన్ లాంటి వాళ్లను కొత్త కుర్రాలను కలిపి సిద్ధం చేయాలి. ఇది ఒక రోజులో అయ్యే పని కాదు. ప్రపంచ కప్పుకి ఒక సంవత్సరం ముందు నుండి టీం ను సిద్ధం చేయాలి. టీం ను నడిపించే మేటి కెప్టెన్ ను కూడా సిద్ధం చేయడం ఎంతైనా అవసరం ఉంది.

Also Read:ఇండియా కొంపముంచిన అంపైర్ కాల్…! అసలు అంపైర్ కాల్ అంటే ఏంటి…?