Ads
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై పర్ఫామెన్స్ అస్సలు మారలేదు. చిన్నచిన్న టార్గెట్స్ కూడా చేధించలేక చతికిల పడ్డ రోహిత్ సేనా వరుసగా ఎనిమిది ఓటములను మూటగట్టుకున్నారు.
Video Advertisement
అద్భుతంగా అడినటువంటి లక్నో జట్టు ప్లే ఆఫ్ ప్లేస్ లో మరో అడుగు ముందుకేసింది. ఈ సీజన్ లో ముంబై మాత్రం వరుస ఓటములను అలవాటు చేసుకుంది. మరి ఈ వరుస ఓటములకు ప్రధాన కారణాలు ఏమిటో చూద్దాం..!!
#1 జట్టులో అంతర్గత కలహాలు:
ముంబై జట్టు మాజీ ప్లేయర్ ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నాయని, ప్లేయర్స్ అంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడమే దీనికి కారణమని అన్నారు. అందుకే ఈ సీజన్ లో ముంబై ఈ విధంగా ఓడిపోతుందని అన్నారు.
#2 రోహిత్ బ్యాడ్ పర్ఫామెన్స్:
ఈ సీజన్ లో ముంబై కెప్టెన్ రోహిత్ చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ మ్యాచ్ లో ఎక్కువ సార్లు డకౌట్ అయిన ప్లేయర్ గా రికార్డును నమోదు చేసుకున్నాడు. ఆయన చెత్త పర్ఫార్మెన్స్ ముంబై ఓడిపోవడానికి ప్రధాన కారణం అని కూడా చెప్పవచ్చు.
#3 సమిష్టి వైఫల్యం:
ఇషాన్ కిషన్, పోలార్డ్, సూర్యకుమార్ యాదవ్ , రోహిత్ శర్మ, బూమ్రా, డేవాల్డ్ బ్రెవిస్.. ఇలా ఎందరో సీనియర్ ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. ముఖ్యంగా బౌలింగులో బూమ్రా, బ్యాటింగ్ లో సూర్యకుమార్ పర్ఫామెన్స్ తప్ప మిగతా ఆటగాళ్లు పర్ఫామెన్స్ ఏ మాత్రం బాగాలేదని వారి మధ్య వారికి అనుసంధానం మిస్ అయిందని సమిష్టి కృషి లేకనే ఈ వైఫల్యానికి కారణం అని తెలుస్తోంది.
#4 నిర్లక్ష్యపు షాట్లు :
బ్యాటర్లకు అనుకూలమైన పీచ్ ఉన్నా కానీ కెప్టెన్ తో సహా మిగతా బ్యాటర్లు అంతా చాలా నిర్లక్ష్యంగా ఆడడంతో ఈ అపజయాలు వచ్చాయని, ప్రత్యర్థి జట్టులోని వారు ఈ మైనస్ లను తెలుసుకొని అన్ని విధాల బాధ్యతలు తీసుకొని ఆడారు కాబట్టి విజయం సాధించారని చెప్పవచ్చు.
#5 15 కోట్ల ఈషాన్ ఆదుకో లేకపోయాడు:
ఐపీఎల్ మెగా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు ఇషాన్ కిషన్ పదిహేను కోట్ల రూపాయలు తీసుకుని ఆయన సీజన్ ప్రారంభంలో అదరగొట్టిన దాన్ని చివరి వరకూ కొనసాగించలేకపోయాడు. తన స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో విఫలమయ్యాడని చెప్పవచ్చు. గత ఆరు మ్యాచ్ ల్లో కిషన్ సాధించిన పరుగులు 64 మాత్రమే. ఇది కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు.
End of Article