Ads
ఎన్నో నిబంధనలతో, జాగ్రత్తలతో ఈ సంవత్సరం ఐపీఎల్ T-20 ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కి, ముంబై ఇండియన్స్ కి మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. ఈ సంవత్సరం ఐపిఎల్ అలా అయిపోయిందో లేదో వచ్చే సంవత్సరం ఐపీఎల్ గురించి అప్పుడే డిస్కషన్స్ మొదలయ్యాయి. ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫైయర్ మ్యాచ్ వరకు వచ్చి వెనుదిరిగింది.
Video Advertisement
జట్టులో కొంత మంది ప్లేయర్స్ అవకాశం ఇచ్చినా కూడా సద్వినియోగం చేసుకోలేదు. కొంత మంది ప్లేయర్స్ ని ఫైనల్ జట్టులోకి తీసుకునే అవకాశం కనిపించడం లేదు. దాంతో ఈ ప్లేయర్స్ అందరూ డగౌట్ కి పరిమితమవుతున్నారు. ఈ కారణం చేత వచ్చే సంవత్సరం ఐపీఎల్ కి, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొన్ని ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా ఐదుగురు ప్లేయర్లని జట్టు నుండి తొలగించే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్లేయర్స్ ఎవరంటే.
#1 బాసిల్ థంపి
డెత్ ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇవ్వడంతో, అలాగే ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో బాసిల్ థంపి నెక్స్ట్ ఐపీఎల్ లో ఉండకపోవచ్చు.
#2 బిల్లి స్టాన్లేక్
ఫైనల్ జట్టులో కేవలం నలుగురు ఫారిన్ ప్లేయర్స్ కి మాత్రమే అవకాశం ఉంది. సన్ రైజర్స్ జట్టు లో ఇప్పటికే డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో, విలియమ్సన్, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్ ఉండడంతో, బిల్లి స్టాన్లేక్ కి జట్టులో చోటు దక్కలేదు.
#3 ఖలీల్ అహ్మద్
తన స్పెల్ లో ఎక్కువ పరుగులు ఇస్తూ ఉండటంతో, అలాగే అంచనాలను కూడా అందుకోలేకపోవడంతో రాబోయే ఐపీఎల్ లో ఖలీల్ అహ్మద్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉండకపోవచ్చు.
#4 బావనక సందీప్
ప్రియం గార్గ్, అభిషేక శర్మ నుంచి సందీప్ కి గట్టి పోటీ ఉంది. అందుకే తుది జట్టులోకి రాలేకపోతున్నారు. కొత్త ప్లేయర్స్ కోసం ఎదురు చూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు సందీప్ ని దక్కించుకునే అవకాశం ఉంది.
#5 శ్రీవత్స్ గోస్వామి
శ్రీవత్స్ గోస్వామి 2008 నుంచి ఐపీఎల్ లో ఉన్నారు. రెగ్యులర్ వికెట్ కీపర్ అయిన శ్రీవత్స్ గోస్వామి కి ఏ ప్రాంచైజీ లో ఉన్నా తుది జట్టులో స్థానం దక్కడం లేదు. రిజర్వ్డ్ కీపర్ గానే ఉండిపోతున్నారు. సన్ రైజర్స్ జట్టులో సాహా, బెయిర్‌స్టో ఉండడంతో శ్రీవత్స్ గోస్వామి కి ఆడే అవకాశం రావడం లేదు.
End of Article