Home Sports Adda “రిషబ్ పంత్” స్థానాన్ని భర్తీ చేయగలిగే 2 ప్లేయర్స్ వీళ్లేనా..?

“రిషబ్ పంత్” స్థానాన్ని భర్తీ చేయగలిగే 2 ప్లేయర్స్ వీళ్లేనా..?

by Mohana Priya

ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో టీమ్ ఇండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ మూడు వన్డేల్లో 85 పరుగులు స్కోర్ చేశారు. టీ20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో రిషబ్ పంత్ 8 పరుగుల వద్ద అవుట్ అయ్యారు.

రిషబ్ పంత్ ప్రదర్శన కారణంగా వన్డే టి20 జట్టులో కొనసాగుతారా లేదా అనే ప్రశ్నలు నెలకొంది. దాంతో రిషబ్ పంత్  స్థానంలో ఈ ఇద్దరు వికెట్ కీపర్లు వచ్చే అవకాశం ఉందనే వార్తలు ప్రచారంలో ఉంది. వారెవరో ఇప్పుడు చూద్దాం.

these players can replace rishabh pant in t20i

#1 కేఎల్ రాహుల్

ఒకవేళ కేఎల్  రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తే రిషబ్ పంత్ స్థానంలో ఒక అదనపు ఆల్ రౌండర్ కి అవకాశం ఇవ్వొచ్చు. దీనివల్ల టీమిండియాకి మరింత బలం దక్కుతుంది. వన్డే టీ20 మ్యాచ్ లలో కేఎల్ రాహుల్ ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. టీమిండియాలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్‌ ని కొనసాగిస్తే, రిషబ్ పంత్ కి మళ్లీ వన్డే టి20 లో కొనసాగడం కష్టమవుతుంది.

these players can replace rishabh pant in t20i

#2  ఇషాన్ కిషన్

ఐపీఎల్ లో మంచి పేరు తెచ్చుకున్న బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్. ఎన్నో అద్భుతమైన విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడారు. 61 ఐపీఎల్ మ్యాచ్‌లలో 1452 పరుగులు చేయడం మాత్రమే కాకుండా, అందులో 9 హాఫ్ సెంచరీలు కూడా చేశారు. ఇషాన్ కిషన్ ఇప్పటివరకు టీమ్ ఇండియా తరపున 3 వన్డేలు, 6 టీ20లు ఆడారు. 46 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 2805 పరుగులు చేశారు. లిస్ట్ ఏ లో 76 మ్యాచ్‌ల్లో 2609 పరుగులు చేశారు. ఇందులో ఇషాన్ కిషన్ 4 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు చేశారు. అందుకే రిషబ్ పంత్ స్థానం ఇషాన్ కిషన్ భర్తీ చేసే అవకాశం కూడా ఉంది.

these players can replace rishabh pant in t20i

You may also like