అందరు అనుకున్నట్టు KKR గెలుపు వెనక ఉన్నది గంభీర్ కాదు … ఈ 2 వ్యక్తులు ఎవరంటే.?

అందరు అనుకున్నట్టు KKR గెలుపు వెనక ఉన్నది గంభీర్ కాదు … ఈ 2 వ్యక్తులు ఎవరంటే.?

by Harika

Ads

ఎంతో ఉత్కంఠ గా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ జట్టుని చిత్తుగా ఓడించింది. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం వెనుక ఉన్నది గౌతమ్ గంభీర్ అని అందరూ అంటున్నారు. గంభీర్ ఈ జట్టుకి మెంటర్ గా వ్యవహరించారు. గతంలో ఇదే జట్టులో గౌతమ్ గంభీర్ ఆడినప్పుడు రెండు సార్లు కప్ గెలిచారు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ మెంటార్ షిప్ లో మరొకసారి కప్ గెలిచారు. దాంతో గౌతమ్ గంభీర్ ని అందరూ ప్రశంసిస్తున్నారు.

Video Advertisement

these two are the reason for kkr win in ipl 2024

బీసీసీఐ గౌతమ్ గంభీర్ కి కోచ్ అవకాశం ఇచ్చినా కూడా షారుఖ్ ఖాన్, గౌతమ్ గంభీర్ ని వదులుకోవాలి అనుకోవట్లేదు అనే వార్తలు వస్తున్నాయి. అందుకే గౌతమ్ గంభీర్ కి షారుఖ్ ఖాన్ ఒక బ్లాంక్ చెక్ ఇచ్చారు. ఇంకో పది సంవత్సరాల పాటు ఇదే జట్టుకి మెంటార్ గా వ్యవహరించాలి అని, గౌతమ్ గంభీర్ నిర్దేశకత్వం ప్లేయర్స్ కి ఎంతో అవసరం అని షారుఖ్ ఖాన్ గౌతమ్ గంభీర్ కి చెప్పినట్టు సమాచారం. అయితే అందరూ గౌతమ్ గంభీర్ ని పొగుడుతున్నారు కానీ, ఇంకొక ఇద్దరు వ్యక్తులు కూడా జట్టు విజయం సాధించడానికి కారణం అయ్యారు. అందులో మొదటి వారు కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్ కోచ్, చంద్రకాంత్ పండిట్. చంద్రకాంత్ భారత మాజీ క్రికెటర్.

1986 నుండి 1992 మధ్యలో టీం ఇండియా నుండి 5 టెస్ట్ మ్యాచ్ లు, 36 వన్డే మ్యాచ్ లు ఆడారు. 1987 లో జరిగిన వరల్డ్ కప్ లో కూడా జట్టులో సభ్యుడిగా ఉన్నారు. క్రికెటర్ గా రిటైర్ అయిపోయాక చంద్రకాంత్ ఒక క్రికెట్ అకాడమీ ప్రారంభించి, అందులో ప్లేయర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ముంబై రంజీ జట్టుకి కోచ్ గా కూడా వ్యవహరించారు. 2003, 2004, 2016 లో ముంబై రంజీ జట్టు టైటిల్ గెలిచింది. ఇందులో చంద్రకాంత్ పండిట్ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆ తర్వాత చంద్రకాంత్ విదర్భ జట్టుకి హెడ్ కోచ్ గా కూడా వ్యవహరించారు. ఆ జట్టు కూడా 2018, 2019 లో రంజీ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత 2022 లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి హెడ్ కోచ్ గా నియమించబడ్డారు.

ఈ సంవత్సరం వాళ్లు ట్రోఫీ గెలిచారు. దాంతో చంద్రకాంత్ పండిట్ జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. చంద్రకాంత్ పండిట్ తో పాటు జట్టు గెలవడానికి ముఖ్య భూమిక పోషించిన మరొక వ్యక్తి బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్. అభిషేక్ నాయర్ గురించి ఎవరు మాట్లాడలేదు. దాంతో మ్యాచ్ అయిపోయాక వరుణ్ చక్రవర్తి మాట్లాడుతూ అభిషేక్ నాయర్ గురించి చెప్పారు. అభిషేక్ నాయర్ జట్టు అసిస్టెంట్ కోచ్ గా కూడా వ్యవహరించారు. రింకు సింగ్ లాంటి ఎంతో మంది ప్లేయర్స్ ని మెరుగుపరచడంలో అభిషేక్ నాయర్ ముఖ్య పాత్ర పోషించారు. వెంకటేష్ అయ్యర్ కూడా మ్యాచ్ అయిపోయాక అభిషేక్ నాయర్ గురించి మాట్లాడి పొగిడారు.


End of Article

You may also like