Ads
ఐపీఎల్ 2024 లో ఫైనల్ మ్యాచ్ లో విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నిలిచింది. హైదరాబాద్ జట్టు మీద భారీగా ఆశలు ఉన్నాయి. కానీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. అయినా కూడా ఇంత దూరం వచ్చినందుకు హైదరాబాద్ జట్టుని ప్రోత్సహిస్తూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ జరిగిన 17 ఏళ్ల చరిత్రలో నాకౌట్ మ్యాచ్ లలో ఎక్కువ బంతులు మిగిలి ఉన్నప్పుడే విజయం సాధించిన మొదటి జట్టుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నిలిచింది. 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. అయితే, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు విజయం సాధించడానికి ఇద్దరు ప్రధాన కారణంగా నిలిచారు. అందులో ఒకరు జట్టుకి మెంటార్ గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్.
Video Advertisement
గౌతమ్ గంభీర్ సారధ్యంలో ఆడిన ఈ జట్టు విజయం సాధించడంతో షారుఖ్ ఖాన్ గౌతమ్ గంభీర్ కి ఒక బ్లాంక్ చెక్ కూడా ఇచ్చినట్టు వార్తలు వస్తోంది. ఇంకో పది సంవత్సరాలపాటు షారుఖ్ ఖాన్, గౌతమ్ గంభీర్ ని జట్టుకి మెంటార్ గా కొనసాగాలి అని కోరినట్టు కూడా అంటున్నారు. గౌతమ్ గంభీర్ మెంటార్ షిప్ జట్టుకి ఎంత ఉపయోగపడింది అనేది ఇది వింటుంటేనే అర్థం అవుతోంది. అయితే జట్టు గెలవడానికి మరొక వ్యక్తి కూడా కీలక పాత్ర పోషించారు. అసలు ఒక రకంగా చెప్పాలి అంటే టీం గెలవడానికి అతనే ప్రధాన కారణం అని అంటున్నారు. అతనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ వేసిన వ్యూహాలు ఎంతో బాగా పనిచేశాయి అని అంటున్నారు. ఫైనల్ మ్యాచ్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
బౌలింగ్ లో కొన్ని మార్పులు కూడా చేశారు. అలా చేసిన ప్రతిసారి హైదరాబాద్ జట్టు వికెట్లు కోల్పోయింది. ఫీల్డింగ్ విషయంలో కూడా కొన్ని మార్పులు చేశారు. అయితే ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ కి దూరం అయ్యారు. వచ్చే నెలలో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం అవుతోంది. ఇందులో శ్రేయస్ అయ్యర్ చోటు దక్కించుకోలేకపోయారు. 2014 తర్వాత మళ్లీ ఇప్పుడు జట్టు విజేతగా నిలవడానికి శ్రేయస్ అయ్యర్ కారణం అయ్యారు అని అందరూ అభిప్రాయపడుతున్నారు. హర్ష భోగ్లే, ఇయాన్ బిషప్ కూడా ఇదే మాట చెప్పారు. టీం ఇండియాకి భవిష్యత్తులో కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ అయితే బాగుంటుంది అని అందరూ అంటున్నారు. అలాంటి వ్యక్తికి క్రెడిట్ ఇవ్వాలి అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.
End of Article