Ads
సెప్టెంబర్ 2 అంటే రేపే ఆసియా కప్ 2023 భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. పాక్ , భారత్ మధ్య మ్యాచ్ అంటే అది కేవలం రెండు దేశాల్లోనే కాదు ప్రపంచం మొత్తం ఫుల్ క్రేజ్ ఉండే మ్యాచ్ అని అర్థం.
Video Advertisement
ఈ క్రమంలో రేపు భారత్ ప్లేయర్స్ ను వనికించేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ పేస్ త్రయం ఇన్ డైరెక్ట్ హింట్ లు ఇస్తోంది. ఆసియా కప్ లో పాల్గొంటున్న పాకిస్తాన్ టీం ప్లేయర్స్ షాహీన్ అఫ్రిది,హరీస్ రవూఫ్,నసీమ్ షా.. జట్టులో బలమైన పేస్ బౌలర్లు.
సూపర్ ఫామ్ లో ఉన్న ఈ ముగ్గురు బౌలర్లను ప్రస్తుతం పాక్ పేస్ త్రయం అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు. వీళ్ళు ముగ్గురు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి వికెట్లు తీయగల సమర్థులు కావడంతో ప్రత్యర్థి టీం ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. మ్యాచ్ స్టార్టింగ్ లోనే వికెట్లు పడగొట్టి అవతలి జట్టును డిఫెండింగ్ లోకి నెట్టడంలో అఫ్రిది, నసీం షాలు ఎక్స్పర్ట్స్. కొత్త బంతి అయినా సరే వీరి చేతిలో మ్యాజిక్ వేసినట్టు కదులుతుంది.
అందుకే వీళ్ళ మ్యాజిక్ ను లాజికల్ గా దెబ్బ కొట్టడం కోసం టీం ఇండియా రోహిత్ కు జోడిగా ఇషాన్ కిషన్ ను ఓపెనర్ గా దింపుతుంది.శుబ్ మన్ గిల్ కంటే కూడ ఇషాన్ కిషన్ స్టార్టింగ్ నుంచి దాటిగా బ్యాటింగ్ ఆడగలడు. వెస్టిండీస్ తో రీసెంట్ గా జరిగిన వన్డే సిరీస్ లో కూడా ఇషాన్ మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడుతూ హ్యాట్రిక్ ఆఫ్ సెంచరీస్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాబట్టి పాక్ పెస్ బౌలర్స్ కు చుక్కలు చూపించాలంటే ఇషాన్ కరెక్ట్ అని టీమిండియా భావిస్తోంది.
పాక్ బౌలర్ల పై ముందుగా ఎదురు దాడి చేయకపోతే ఆ తర్వాత వాళ్లు ఎక్కువగా ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉంటుంది అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ క్రీజులో నిలబడడం కోసం నెమ్మదిగా ఆడినట్.. ఇషాన్ కిషన్ అవతల వైపు నుంచి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగలడు. ఇక టీమిండియా నుంచి మూడవ స్థానంలో శుబ్ మన్ గిల్,నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ , ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, జడేజాలు బరిలోకి దిగుతారు.
ALSO READ : చిరుత దాడి కంటే ముందు..1980లో తిరుమలలో అదే ప్లేస్ లో జరిగిన ఈ సంఘటన తెలుసా..?
End of Article