Ads
2023 ప్రపంచ కప్ లో భారత జట్టు విజయపరంపరను కొనసాగిస్తుంది. మొన్న పాకిస్తాన్ పైన ఘన విజయం సాధించిన భారత్ నిన్న బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్ లో కూడా ఏడు వికెట్ల తేడాతో విజయభేరి కొనసాగించింది. కింగ్ కోహ్లీ తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో సెంచరీ పూర్తి చేసి అభిమానులకు పండుగ తీసుకొచ్చాడు.
Video Advertisement
భారత జట్టు బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో టీం సునాయాసంగా విజయం సాధిస్తుంది. ఇలాంటి సమయంలో భారత్ జట్టుకు ఒక షాక్ తగిలింది.
టీంలో ఆల్రౌండర్ గా ఉన్న స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా గాయం టీం ని కలవరపెడుతుంది. బౌలర్ గాను, బ్యాట్స్ మెన్ గాను రాణించే సామర్థ్యం ఉన్న హార్దిక్ పాండ్య గాయం కారణంగా దూరమైతే భారత జట్టుకు ఇది కోలుకోలేని దెబ్బ అని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.హార్దిక్ గాయం నుండి కోలుకోవాలని క్రికెట్ అభిమానులంతా ప్రార్థిస్తున్నారు.
హార్దిక్ గనుక టీం లో లేకపోతే టీం గాడి తప్పుతుంది. ప్రస్తుతం ఉన్న భారత జట్టులో అతనికి ప్రత్యామ్న్యాయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో హార్దిక్ 90% ఫిట్ గా ఉన్నా సరే భారత టీమ్ అతనిని ఆడించడానికి సిద్ధంగా ఉంది.అయితే స్కానింగ్ రిపోర్టులు వచ్చేదాకా అతనికి గాయం పైన స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఒకవేళ గాయం తీవ్రమైతే అప్పుడు అతని స్థానంలోకి జట్టులోకి ఎవరు వస్తారు అన్నది కీలకంగా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే హార్దిక్ పాండ్యా బాగానే ఉన్నట్టు తెలియజేశారు.
అయితే హార్దిక్ జట్టు నుండి వైదొలిగితే అతను స్థానంలో వచ్చే వారి పైన ఊహాగానాలు మొదలయ్యాయి. అక్షర పటేల్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, శివం దుబే పేర్లు తెరపైకి వస్తున్నాయి. దాదాపు అక్షర పటేల్ ని జట్టులోకి తీసుకోవాలని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నట్లుగా సమాచారం.పరిస్థితి ఇంతవరకు రాకుండా హార్దిక్ పాండ్యా కోరికను తిరిగి జట్టులోకి రావాలని భారత అభిమానులు, ప్రేక్షకులు దేవుని ప్రార్థిస్తున్నారు.
Also Read:టీం ఇండియా మీద ఇంత కుళ్ళా.? ఓడిస్తే డేటింగ్ అంటూ బంగ్లా ప్లేయర్స్ కి ఆఫర్ ఇచ్చిన పాక్ నటి.!
End of Article