వైడ్ కాదు, నో బాల్ కాదు.. కానీ ఓవర్ కి 7 బంతులు… అదెలానో తెలుసా..?

వైడ్ కాదు, నో బాల్ కాదు.. కానీ ఓవర్ కి 7 బంతులు… అదెలానో తెలుసా..?

by Anudeep

Ads

క్రికెట్ చూడడం అంటే ఎంతో మందికి ఇష్టం. ఐపీఎల్ మ్యాచ్ల మొదలు వన్డే మ్యాచ్ల వరకు ప్రతీ మ్యాచ్ ని కూడా చాలా మంది వదలకుండా చూస్తూ వుంటారు. నిజానికి క్రికెట్ చూస్తూ ఉంటే సమయమే తెలియదు. ఇక ఐపీఎల్ మ్యాచ్లు అయితే హోరా హోరీగా జరుగుతాయి. నచ్చిన టీం ని సపోర్ట్ చేస్తూ టీవీ ముందు నుండి కదలరు.

Video Advertisement

మెన్స్ క్రికెట్ అయినా, ఉమెన్స్ క్రికెట్ అయినా క్రికెట్ ఆటలో ఉండే మహత్యం అలాంటిది. అలాగే.. క్రికెట్ ఆటలో ఉండే రూల్స్ కూడా దాదాపు మ్యాచ్ చూసే అందరికి తెలిసే ఉంటాయి.

umpire 1

సాధారణంగా క్రికెట్ లో ఒక ఓవర్ కి ఆరు బంతులు మాత్రమే ఉంటాయి. కానీ, ఇటీవల వరల్డ్స్ ఉమెన్స్ క్రికెట్ లో భాగంగా దక్షిణాఫ్రికా- పాకిస్తాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఒక ఓవర్ కి ఏడు బంతులను వేశారు. జనరల్ గా ఆటలో నో బాల్, లేదా వైడ్ వస్తేనే ఇలా జరుగుతుంది. కానీ, ఇవేమి జరగకుండానే ఒక ఓవర్ లో ఏడు బంతులు వేశారు. అదెలా జరిగిందో ఇప్పుడు చూద్దాం.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ చేస్తుండగా 27 వ ఓవర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒమైమా సోహైల్ ఆఖరి బంతి బౌలింగ్ ఇవ్వగా, బ్యాటర్‌ సునే లూస్‌ ను అంపైర్ అవుట్ అయినట్లు తేల్చాడు. కానీ, రివ్యూలో ఆమె అవుట్ అవ్వలేదని తేలింది. ఈ క్రమంలో అది ఆఖరు బంతి అని మర్చిపోయిన అంపైర్ బౌలర్ తో మరో బాల్ ని కూడా వేయించాడు. అలా ఒక ఓవర్ కి ఏడు బంతులు పడ్డాయి. అయితే.. ఈ అంపైర్ చేసిన నిర్వాకంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పాకిస్థాన్ పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ తీసుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత యాభై ఓవర్లలో 223 పరుగులు చేసింది.


End of Article

You may also like