“రికీ పాంటింగ్” పేరిట ఉన్న ఆ 4 రికార్డులు ఎప్పటికీ బ్రేక్ అయ్యేనో.?

“రికీ పాంటింగ్” పేరిట ఉన్న ఆ 4 రికార్డులు ఎప్పటికీ బ్రేక్ అయ్యేనో.?

by Anudeep

Ads

రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా విజయవంతమైన నాయకులలో ఒకడు. పాంటింగ్ ఆస్ట్రేలియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఒకానొక కాలంలో ఆస్ట్రేలియా టీం అంటేనే ప్రత్యర్థి జట్టుకు వణుకు పుట్టేలా చేసాడు పాంటింగ్. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన పాంటింగ్ ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుకు కోచ్ గా ఉన్నాడు.

Video Advertisement

అయితే గత కొంతకాలంగా పాంటింగ్ పేరిట ఉన్న రికార్డులు కోహ్లీ, రోహిత్ ను ఊరిస్తూ వస్తున్నాయి. వాటిని ఎప్పుడు సమం చేస్తారా అని క్రికెట్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు.

ఆ రికార్డులు ఏంటో  ఒకసారి చూద్దాం . .

1.  71 ఇంటర్నేషనల్ సెంచరీలు:

రికీ పాంటింగ్ మొత్తం ఇంటర్నేషనల్ సెంచరీలు 71 చేసాడు. అందులో టెస్ట్ సెంచరీలు 41 కాగా వన్డేల్లో 30 చేసాడు. అయితే విరాట్ టెస్ట్ లలో 27 సెంచరీలు, వన్డేలలో 43 సెంచరీలు మొత్తం 70 సెంచరీలతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డుని (71 ఇంటర్నేషనల్ సెంచరీలు) అందుకోడానికి ఒక సెంచరీ దూరంలో ఉన్నాడు.

కోహ్లీ చివరి టెస్ట్ సెంచరీ 136 (194) 2019 నవంబర్ 22 న ఈడెన్ గార్డెన్స్ లో బాంగ్లాదేశ్ పైన చేసాడు. అలాగే వన్డే సెంచరీ 114 (99) ఆగస్టు 14 2019 లో క్వీన్స్ పార్క్ ఓవల్ లో వెస్టిండీస్ మీద చేసాడు. ఆ ఒక్క సెంచరీ ఎప్పుడు చేస్తాడా పాంటింగ్ రికార్డ్ ని ఎప్పుడు సమం చేస్తాడా అని కోహ్లీ అభిమానులు గత మూడేళ్ళుగా ఎదురు చూస్తూనే ఉన్నారు.

2. 30 వన్డే సెంచరీలు:

player whose career ended because of rohit sharma

అలాగే పాంటింగ్ వన్డేలలో చేసిన సెంచరీలు 30 కాగా రోహిత్ శర్మ వన్డే సెంచరీలు 29. ఇక పాంటింగ్ సెంచరీల సంఖ్యని చేరుకోవాలంటే కావాలసింది ఒక సెంచరీ మాత్రమే కానీ రోహిత్ శర్మ తన వన్డే చివరి సెంచరీ చేసి రెండు సంవత్సరాల పైనే అయింది. 19th జనవరి 2020 లో ఆస్ట్రేలియా పై తన చివరి వన్డే సెంచరీ (119) చేసాడు. ఇక రోహిత్ అభిమానులు కూడా ఆ ఒక్క సెంచరీ చేసి పాంటింగ్ వన్డే సెంచరీలని ఎప్పుడు సమం చేస్తాడా అని చూస్తున్నారు.

3. 20 వరుస విజయాలు:

అలాగే కెప్టెన్ గా వరుసగా 20 మ్యాచ్ లు గెలిపించిన  రికార్డ్ కూడా రికీ పాంటింగ్ పేరిటే ఉంది. కెప్టెన్‌గా రోహిత్‌ వరుసగా 19వ విజయం సాధించాడు. ఆదివారం (జూలై 10) భారత్ ఇంగ్లండ్ సిరీస్ స్వీప్‌ చేస్తే, 2003లో 20 విజయాలతో పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక వరుస విజయాలు సాధించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను రోహిత్ సమం చేసే వాడే కానీ ఆ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయి రోహిత్ వరుస విజయాలను బ్రేక్ పడింది.

4. కెప్టెన్ గా అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు:

దీంతో పాటు కెప్టెన్ గా అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు అందుకున్న రికార్డ్ 28 పాంటింగ్ పేరిటే వుంది . 27 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ల వద్ద కోహ్లీ ఆగిపోయి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో రికీ పాంటింగ్ వరుస విజయాల రికార్డ్, మ్యాన్ ఆఫ్ ది రికార్డ్ ప్రస్తుతానికి చెక్కు చెదరకుండా ఉండడంతో పాటు బ్యాటింగ్ లో ఫామ్ కోల్పోయి కోహ్లీ, రోహిత్ పరుగులు చేసేందుకే తడబడుతుంటే.. ఇప్పట్లో సెంచరీ కష్టమనే చెప్పవచ్చు. దీంతో రికీ పై ఉన్న రికార్డులపై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.


End of Article

You may also like