“ధోని అవమానించడంతో రిటైర్ అవుదామనుకున్నా.! అప్పుడు సచిన్ ఏం చెప్పాడంటే.?” అంటూ… సెహ్వాగ్ కామెంట్స్..!

“ధోని అవమానించడంతో రిటైర్ అవుదామనుకున్నా.! అప్పుడు సచిన్ ఏం చెప్పాడంటే.?” అంటూ… సెహ్వాగ్ కామెంట్స్..!

by Sunku Sravan

Ads

2008 ఆస్ట్రేలియా పర్యటనలో జట్టులోంచి తీసేసి ధోని అవమానించడం తో వన్డే క్రికెట్ కు అప్పుడే రిటైర్మెంట్ ఇద్దామనుకున్నట్లు టీం ఇండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. అయితే అప్పుడు రిటైర్మెంట్ వద్దని సచిన్ సర్ది చెప్పడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సెహ్వాగ్ పేర్కొన్నాడు.

Video Advertisement

2008 లో టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు ఓపెనర్ సెహ్వాగ్ మంచి స్కోర్ సాధించలేకపోయాడు. దీంతో అప్పటి కెప్టెన్ ధోని తనను తుది జట్టు నుంచి తోలించడంతో మనస్తాపానికి గురైన సెహ్వాగ్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుదానమనుకున్నట్లు తెలిపాడు. కానీ ఆ సమయంలో సచిన్ వద్దని వారించడంతో ఆ నిర్ణయం తీసుకోలేదని సెహ్వాగ్ చెప్పాడు. తొందరపాటుతో ఏ నిర్ణయాలు తీసుకోవద్దని పర్యటన ముగిసిన తర్వాత ఇంటికెళ్లి ఏం చేయాలో ఆలోచింవచమని సచిన్ సలహా ఇవ్వడంతో ఆ తొందరపాటు ఆలోచనను విరమించుకున్నానని సెహ్వాగ్ అన్నాడు.

Sehwag with Sachin

Sehwag with Sachin

ఆటగాళ్లలో రెండు రకాలు ఉంటారని వారిలో ఒక రకం వాళ్ళు ఎంత కఠినమైన పరిస్థితులలోనైనా సరదాగా ఉంటారు. విరాట్ కోహ్లీ కూడా ఇలాంటి ఆటగాడి. అతడు విమర్శలు విని మైదానం లో వాటికి సమాధానము చెబుతాడు. రెండో రకం నాలోంటోళ్లు అసలు విమర్శలను లెక్కచేయం. కోహ్లీ తొందర్లోనే తన ఫామ్ ని రాబడతాడని సెహ్వాగ్ ఆశాభావం వ్యక్తం చేసాడు.


End of Article

You may also like