Ads
ప్రపంచంలో సినిమాకి ఎంత మంది అభిమానులు ఉంటారో, క్రికెట్ కి కూడా అంత మంది అభిమానులు ఉంటారు. క్రికెట్ అంటే ప్రేక్షకులు ఒక ఎమోషన్ లాగా భావిస్తారు. ముఖ్యంగా భారతదేశంలో క్రికెట్ కి చాలా విలువ ఇస్తారు. సినిమాలతో సమానంగా క్రికెట్ అభిమానులు కూడా ఉంటారు. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న, అంటే మే 16వ తేదీన, సన్‌రైజర్స్ హైదరాబాద్ కి, గుజరాత్ టైటాన్స్ కి మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగాల్సి ఉంది. నిన్న సాయంత్రం ఈ మ్యాచ్ జరగాలి. కానీ నిన్న సాయంత్రం సమయానికి వర్షం మొదలైంది. కుండపోతగా వర్షం కురిసింది. ఆగుతుంది అని ఎదురు చూస్తూ ఉంటే అసలు ఆగలేదు.
Video Advertisement
తర్వాత ఇంకా కొంచెం సేపటికి ఇంకా పెరిగింది. దాంతో మ్యాచ్ ఆపేశారు. మామూలుగా అయితే వర్షం పడుతూ ఉంటే, మ్యాచ్ మధ్యలో ఓవర్స్ తగ్గిస్తారు. లేదు అంటే 5 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహిస్తారు. కానీ ఈసారి వర్షం మరీ ఎక్కువగా ఉండటంతో మ్యాచ్ ఆపేశారు. అయితే, మ్యాచ్ చూడడానికి టికెట్స్ బుక్ చేసుకున్న వారు చాలా మంది ఉంటారు. టీవీలలో ఎన్నో కోట్ల మంది మ్యాచ్ చూస్తారు. స్టేడియంలో ఎన్నో లక్షలు మంది మ్యాచ్ చూడటానికి వెళ్తారు. అక్కడికి వెళ్లి, అక్కడ లైవ్ లో మ్యాచ్ చూసి, ప్లేయర్స్ ని ప్రోత్సహిస్తారు. చాలా మందికి లైవ్ మ్యాచ్ గందరగోళంగా ఉంటుంది కాబట్టి టీవీలో ఎక్కువ చూడాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ కొంత మంది ఎంత గందరగోళంగా ఉన్నా సరే, ప్రత్యక్షంగా మ్యాచ్ చూస్తేనే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు.
అలా ఉన్నప్పుడు మ్యాచ్ కి టికెట్స్ బుక్ చేసుకుంటారు. హైదరాబాద్ జట్టు మ్యాచ్ హైదరాబాద్ లో జరుగుతోంది అంటే ఇంకా ఎక్కువ మంది బుక్ చేసుకుంటారు. దాంతో నిన్న మ్యాచ్ ఆగిపోవడంతో చాలా మంది అభిమానులు నిరాశ చెందారు. అయితే మ్యాచ్ కోసం టికెట్లు ముందే బుక్ చేసుకొని ఉంటారు. కాబట్టి ఇప్పుడు మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయాక, టికెట్ సంగతి ఏంటి అని ఆలోచిస్తారు. నిన్న అయితే, మ్యాచ్ క్యాన్సిల్ అయ్యాక, స్టేడియంలో ఉన్న స్క్రీన్ మీద, “మెయిల్ ద్వారా కానీ, టికెట్ బుక్ చేసుకున్నప్పుడు వాడిన ఫోన్ నెంబర్ ద్వారా కానీ, టికెట్ రిఫండ్ డీటెయిల్స్ షేర్ చేస్తాం. టికెట్ కాపీ ఒకటి అందుబాటులో పెట్టుకోండి” అని డిస్ప్లే చేశారు. మ్యాచ్ క్యాన్సిల్ అయితే టికెట్ కి కట్టిన డబ్బులు వెనక్కి ఇచ్చేసే ప్రాసెస్ ఇలా జరుగుతుంది అని తెలిపారు.
End of Article