తిరుమలలో శ్రీవారికి ఇలాంటి గంగాళంలో మాత్రమే ఎందుకు నైవేద్యం పెడతారు..? దీని వెనక ఉన్న కథ ఏంటంటే..?

తిరుమలలో శ్రీవారికి ఇలాంటి గంగాళంలో మాత్రమే ఎందుకు నైవేద్యం పెడతారు..? దీని వెనక ఉన్న కథ ఏంటంటే..?

by Anudeep

Ads

తిరుమల క్షేత్రం ఎంత ప్రసిద్ధమైనదో అందరికి తెలిసినదే. కలియుగ వైకుంఠంగా పిలవబడుతున్న తిరుమలలో ప్రసాదాలు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అయితే.. తిరుమల శ్రీవారికి నైవేద్యాలను నివేదించడంలో కూడా ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

1800 ల నాటి కాలంలో శ్రీవారికి నైవేద్యం పెట్టడానికి ఎక్కువగా వెదురు బుట్టలను వాడేవారు. అప్పట్లో కొండమీద హోటల్స్ ఏమీ లేవు. భక్తులకు కూడా బుట్టల్లోనే బోజనాలను పంచిపెట్టేవారు.

tirumala 1

హోటల్స్ లేని ఆ రోజుల్లో.. ఆ బుట్ట భోజనాలే భక్తుల కడుపు నింపేవి. అక్కడక్కడా రామానుజా కూటములు అన్న సంతర్పణలు చేసేవి. కానీ, ప్రధానంగా స్వామి వారి ప్రసాదమే భక్తుల ఆకలి తీర్చేది. ఆ రోజుల్లో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ లో థామస్ మన్రో అనే అధికారి ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీ లో గవర్నర్ గా పని చేసేవారు. ఆయన క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు… భారతీయ హైందవ విధానాల పట్ల ఆయనకు గౌరవం ఉండేది కాదు.

tirumala 3

చాలాసార్లు ఉద్యోగరీత్యా తిరుమలకి వచ్చారు. కానీ ఒక్కసారి కూడా స్వామిని దర్శించుకోలేదు. అప్పట్లో పొంగలి, పులిహారా , దద్దోజనం వంటి పదార్ధాలు ప్రధాన నైవేద్యంగా ఉండేవి. వాటినే ప్రసాదంగా పంచిపెట్టేవారు. అక్కడి భక్తులు వీటిని తినే కడుపు నింపుకునేవారు. అందరు ఎంతో ఆర్తిగా నేలపైనే కూర్చుని చేతులతోనే ఆ వెదురు బుట్టలో ప్రసాదాలు తినడం చూసి ఈయన చిరాకు పడేవారు.అలా తినడం వల్లే అంటు వ్యాధులు, కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అని థామస్ మన్రో వాదించేవారు.

tirumala 4

తన అధికారాన్ని ఉపయోగించి భక్తులు ఆ ప్రసాదాలు తినకుండా ఆదేశాలు జారీ చేసారు. అయితే.. ఆ తరువాత ఆయనకు విపరీతమైన కడుపునెప్పి వచ్చింది. ఏ సాకు చూపి ఆయన ప్రసాదాలను నిలిపేశారో.. అదే కడుపునొప్పిని ఆయన అనుభవించాల్సి వచ్చింది. ఆయన ఆరోగ్యం క్షీణించి , పూర్తిగా అనారోగ్యంతో మంచం పట్టారు. ఓ సారి ఆయనకీ మంత్రాలయం రాఘవేంద్రస్వామి వారి మీద భక్తి కలిగింది. ఆ స్వామి ఆలయానికి ఎన్నో కైంకర్యాలు కూడా చేయించారు. కానీ, కడుపునొప్పి తగ్గలేదు.

tirumala 2

అయితే.. మంత్రాలయ పీఠాధిపతులు ఆయన తిరుమల శ్రీవారి పట్ల ,ఆయన ప్రసాదాల పట్ల వ్యవహరించిన తీరుని తప్పు పట్టారు. వారి సలహాతో.. శ్రీవారి ప్రసాదమైన పులిహోరని నేరుగా తన చేతితోనే తిన్నారు. శ్రీవారి లీలలో ఏమో.. ఆయన కడుపునెప్పి వెంటనే తగ్గిపోయింది. తాను చేసిన తప్పు తెలుసుకున్న థామస్ మన్రో తిరిగి ప్రసాదాల వితరణని కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చారు. స్వామి వారికి నైవేద్యాలను సమర్పించడం కోసం గంగాళాలను అందించాడు. అయితే.. ఎన్ని గంగాళాలు అందించినా.. ఎంత పశ్చాత్తాపం చెందినా.. స్వామి వారు మాత్రం థామస్ మన్రో కు దర్శనం ఇవ్వలేదు. స్వామిని ప్రార్ధిస్తూనే ఆయన ప్రాణం వదిలారు. అయితే ఈ గంగాళాలు మాత్రం తిరుమలలో ఇప్పటికి ఉన్నాయి. వీటిని మన్రో గంగాళాలు అని పిలుస్తారు. మన్రో ఆధ్యాత్మిక మార్పుకి, అతని పరివర్తనకు గుర్తుగా వీటిల్లోనే ప్రసాదాలు అందించేలా స్వామి వారు చూసుకున్నారు.

 


End of Article

You may also like