ట్రైన్ టికెట్ దొరకలేదా..? తత్కాల్ బుక్ చేయాలంటే…ఇలా చేస్తే టికెట్ పక్కా..!!

ట్రైన్ టికెట్ దొరకలేదా..? తత్కాల్ బుక్ చేయాలంటే…ఇలా చేస్తే టికెట్ పక్కా..!!

by Megha Varna

Ads

ఒక్కోసారి మనం ప్రయాణం చేయాలి అనుకుంటూ ఉంటాము. కానీ సమయానికి టికెట్లు దొరకవు. నిజంగా అలాంటి సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా ఇప్పుడు అసలే పండగ సీజన్. ఇక రైల్వే టికెట్లు తీసుకోవాలంటే పెద్ద చిక్కే. సాధారణ బుకింగ్ లో రైలు టికెట్ దొరకకపోతే మనం తత్కాల్ లో బుక్ చేయొచ్చు. అయితే ఈ విధంగా ఫాలో అయితే కచ్చితంగా తత్కాల్ టికెట్ దొరుకుతుంది.

Video Advertisement

తత్కాల్ టికెట్లకు పోటీ ఎక్కువగా ఉంటుంది. అందుకని మీరు తత్కాల్ టికెట్ కచ్చితంగా బుక్ చేయాలనుకుంటే ఇలా ఫాలో అవ్వండి. అప్పుడు ఖచ్చితంగా మీరు తత్కాల్ టికెట్ పొందొచ్చు. IRCTC వెబ్ సైట్ ద్వారా మనం తత్కాల్ టికెట్లను బుక్ చేయవచ్చు. మీరు కనుక ప్రయాణం కచ్చితంగా చేయాలని.. తత్కాల్ టికెట్ కచ్చితంగా పొందాలని అనుకుంటే ముందే IRCTC వెబ్ సైట్ లో ప్రయాణికుల వివరాలను సేవ్ చేసి ఉంచుకోండి.

ఇలా వివరాలు సేవ్ చేసి ఉంచడం వల్ల బుకింగ్ ప్రాసెస్ వేగంగా పూర్తవుతుంది. దీనితో టికెట్ కూడా కచ్చితంగా దొరుకుతుంది. మీ వివరాలు లేదా మీతో పాటు ప్రయాణం చేసే వాళ్ల వివరాలు కూడా మీరు సేవ్ చేసి ఉంచుకోండి. బుకింగ్ చేసేటప్పుడు మళ్లీ వివరాలను ఇవ్వక్కర్లేదు. టికెట్ బుక్ చేసే టైం లో ”యాడ్ ఎగ్జిస్టింగ్” పైన క్లిక్ చేసి ప్రయాణికుల పేరు సెలెక్ట్ చేస్తే సరిపోతుంది.

ఆటోమేటిక్ గా వివరాలు అన్నీ కూడా వస్తాయి. కాబట్టి టికెట్ బుకింగ్ త్వరగా పూర్తయిపోతుంది. పేమెంట్ చేసి మీరు డైరెక్టుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే తత్కాల్ టికెట్ బుక్ చేసేటప్పుడు యూపీఐ మోడ్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే వివరాల్ని ఎంటర్ చేసేలోగా తత్కాల్ కోట పూర్తయిపోవచ్చు. లేదంటే మీరు IRCTC ఈ వాలెట్ లో ముందే డబ్బుల్ని లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇది కూడా మీకు త్వరగా టికెట్ ని పొందడానికి హెల్ప్ అవుతుంది.


End of Article

You may also like