Ads
ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపీఎల్ )15 లో గత నాలుగు మ్యాచ్ ల్లో పోరాడి ఓడిన చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 24 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఇందులో ముఖ్యంగా శివమ్ దూబే 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్ లు 95 చేసి నాటౌట్ గా నిలిచాడు. అలాగే రాబిన్ ఊతప్ప 50 బంతుల్లో 4 బోర్లు, 9 సిక్స్ లు మొత్తం 88 పరుగులు చేసి జట్టు కీలకంగా వ్యవహరించి 216 పరుగుల భారీ స్కోరును అందించాడు.
Video Advertisement
ఈ స్కోరు ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 193 పరుగులకే చతికిలా పడింది. దినేష్ కార్తీక్ (34,14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్ లు ), సూయాష్ ప్రభు దేశాయ్ (34,18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ ), షాబాజ్ నదీమ్ (41,27 బంతుల్లో 4 ఫోర్లు ) ఇంత పోరాడిన అప్పటికే మ్యాచ్ చెన్నై చేతుల్లోకి వెళ్ళిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన ఆరంభం లభించలేదు. పవర్ ప్లే లో ఓ వికెట్ కోల్పోయిన సూపర్ కింగ్స్ 35 పరుగులే చేసింది.
పది ఓవర్ల తర్వాత జట్టు స్కోరు 60/2. కానీ చివరి 10 ఓవర్లలో జట్టు 100 పరుగులు చేసిన మొత్తం 160 అవుతాయి. మరోసారి స్వల్ప స్కోరుకే పరిమితమయ్యేలా ముందు కనిపించిన సూపర్ కింగ్స్ భారీ విన్యాసాలు భారీ స్కోరు అందించాయి. వెటరస్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప (88), యువ బ్యాటర్ శివం దూబే (95 నాటౌట్ ) సంచలనం సృష్టించారు. వీరి విశ్వరూపంతో చివరి 10 ఓవర్లలో చెన్నై ఏకంగా 156 పరుగులు చేసి ఔరా అనిపించింది. ఇందులో ఊతప్ప 33 బంతుల్లో అర్థ సెంచరీ చేయగా..
దూబే 30 బంతుల్లో ఆ ఘనత సాధించాడు. డెత్ ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఊతప్ప, దుబే సిక్సర్ల వర్షం కురిపించారు. దుబే ఎనిమిది సిక్సర్లు సంధించగా, ఊతప్ప 9 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇద్దరి మెరుపు బ్యాటింగ్ తో చెన్నై 216 పరుగులు నమోదు చేసింది. పరుగుల చేదనలో బెంగళూరు బోల్తా పడింది. కెప్టెన్ డూప్లేసిస్ (8) అనూజ్ రావత్ (12), విరాట్ కోహ్లీ (1). మిడిలార్డర్లో మ్యాక్స్ వెల్(26), షాబాజ్ నదీమ్ (41),శుయూష్ (34), దినేష్ కార్తీక్ (34) పోరాటం సరిపోలేదు. ఇన్నింగ్స్ 17 ఓవర్లలో ముఖేష్ పై కార్తిక్ 23 పరుగులు పిండుకొని ఆసక్తి రేపిన.. ఆ తర్వాత ఓవర్లో బ్రావో అతడిని విన్యాసాలకు ముగింపు పలికాడు. కార్తీక్ నిష్క్రమణతో బెంగళూరు ఓటమి లాంఛనమైంది. 20 ఓవర్లలో బెంగళూరు 193 పరుగులు చేసి ఓడిపోయింది.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18#19
#20
#21
End of Article