ఢిల్లీ వేడుకగా ఆఫ్గనిస్తాన్ జట్టుతో తలపడిన భారత్ వరుసగా రెండవ మ్యాచ్ లో విజయ ఢంకా మోగించింది. ఈరోజు జరిగిన మ్యాచ్లో హిట్ మాన్ కెప్టెన్ రోహిత్ శర్మ తన పూర్వపు ఫార్మ్ ను చూపిస్తూ చెలరేగి ఆడాడు. భారత్ ఈరోజు జరిగిన మ్యాచ్ లో 35 ఓవర్లకే 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ టీం పై విజయం సాధించింది. మొదటి మ్యాచ్ లో డక్ అవుట్ అయ్యి వెనుతిరిగిన రోహిత్ శర్మ తీవ్ర విమర్శలకు గురి అయ్యాడు. ఈ నేపథ్యంలో ఈరోజు అతను చేసిన మెరుపు సెంచరీ క్రికెట్ అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.

Video Advertisement

కేవలం 63 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసిన హిట్ మాన్ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఇన్నింగ్స్ ఆరంభం నుంచే చెలరేగి దూకుడుగా ఆడిన రోహిత్ బంతిని బౌండరీ వైపు పరుగులు పెట్టించాడు. 84 బంతులలో 16 ఫోర్లు , 5 సిక్స్లతో మోత మోగించిన రోహిత్ 131 పరుగులు సాధించాడు. నిన్నటి వరకు రోహిత్ పై మిమ్స్ చేసి విమర్శించిన నెటిజన్స్ ఇప్పుడు తెగ పొగుడుతూ పోస్టులు, మిమ్స్ పెడుతున్నారు.

అలాగే ఇంతకముందు లక్నోలో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హజ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. అప్పుడు కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతుండగా…నవీన్ ఉల్ హజ్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్నాడు. అయితే ఇప్పుడు ఈరోజు స్టేడియంలో ఇద్దరూ చాలా ఫ్రెండ్లీగా కనిపించారు. దీంతో మీమర్స్ ఈ ఇద్దరు పై కూడా పలు రకాల మిమ్స్ పెడుతున్నారు.

#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#9.

#10.

#11.

#12.

#13.

#14.

#15.