Ads
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) సీజన్ 15 లో డూ ప్లేసెస్ సూపర్ ఇన్నింగ్స్ కు తోడుగా హేజిల్ వుడ్ బౌలింగులో చెలరేగడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (rcb) మరొక విజయం అందుకుంది. లక్నో సూపర్ జెంట్స్ పై మంగళవారం జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు టీం నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. దీని ఛేదనలో లక్నో జట్టు చివరి ఓవర్ వరకు ఆడి 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Video Advertisement
దీంతో ఆర్సీబీ జట్టు 18 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి ఎగబాకింది. తొలుత డూప్లిసెస్ (96) త్రుటిలో మిస్ చేసుకున్న, మాక్సివెల్, శబాజ్, అహ్మద్ బ్యాటింగ్లో రాణించారు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు 7 పరుగులకే 2 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ అనూజ్ రావత్ నాలుగు పరుగులకే అవుట్ కాగా, విరాట్ కోహ్లీ(0) మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లు చామీరా ఖాతాలోకి చేరాయి. ఈ దశలోనే కెప్టెన్ డూప్లిసెస్ ఎంతో బాధ్యతాయుతంగా ఆడారు. డూప్లిసెస్ మరియు మ్యాక్స్ వెల్ కలిసి మూడో వికెట్ కు 37 పరుగులు జత చేశారు. మ్యాక్స్వెల్ (23), షాబాజ్ అహ్మద్ (26)ల సహకారంతో డుప్లెసిస్ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. డూప్లిసెస్ 64 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్స్ లు మొత్తం 96 పరుగులు చేసి సెంచరీకి దగ్గర్లో అవుటయ్యారు.
జాసన్ హోల్డర్ బౌలింగులో భారీ షాట్ కు యత్నం చేసి స్టోయినిస్ కు చిక్కాడు. లక్నో బౌలర్లలో దుస్మాంత చామీరా, హోల్డర్ కు రెండేసి, కృనాల్ పాండ్యా కు ఒక వికెట్ లభించాయి. దీని చేతనలో లక్నో ఓపెనర్లు డికక్ (7), మనీష్ పాండే(6), నిరాశపరిచిన కెప్టెన్ కేఎల్ రాహుల్ (30), కృనాల్ పాండ్యా (42) బ్యాటింగ్ లో రాణించారు. చివరిలో స్టోయినిస్ (24) మినహా మిగిలిన వారు ఘోరంగా విఫలమయ్యారు. హేజిల్ వుడ్ కు 4, హర్షల్ పటేల్ కు రెండేసి వికెట్లు దక్కాయి. దీంతో బెంగళూరు జట్టు ఏడు మ్యాచుల్లో 5 మ్యాచులు విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
#1
#2
# 3
#4
#5
#6
#7
#8
#9
#10
End of Article