“మనోళ్ళని ట్రోల్ చేసారు… ఇప్పుడేమైంది?”అంటూ …ఫైనల్ లో ఇంగ్లాండ్ తో పాకిస్తాన్ ఓడిపోడంపై 18 ట్రోల్ల్స్.!

ప్రపంచ కప్ టీ 20 ఫైనల్ విజేతగా ఇంగ్లాండ్ గెలిచింది. మెల్‌బోర్న్‌ వేదికగా ఆదివారం నాడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాక్ ని చిత్తుగా ఓడించి ప్రపంచ టీ 20 ఛాంపియన్ గా నిలిచింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ పాక్ కి అప్పగించిన ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ 20 ఓవర్లలో పాక్ జట్టు కేవలం 137 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. పాక్ జట్టులో బాబర్ 32 , మాసూత్ 38 పరుగులు చెయ్యగా..మరో బ్యాట్స్మన్ షాదాబ్ ఖాన్ 20 పరుగులు చేసాడు. స్వల్ప లక్ష్యం తో బరి లోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఓపెనర్ అలెక్స్ హాల్స్ తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టగా సెమిస్ లో రాణించిన స్టార్ బాట్స్మన్ బట్లర్ కేవలం 26 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన బెన్ స్టోక్స్ జట్టుని విజయ తీరాలకి చేర్చి ఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టుకి ప్రపంచ కప్ ని అందించడం లో కీలక బాధ్యత వహించాడు. 1992 తరువాత మరోసారి ఆస్ట్రేలియా లో ప్రపంచకప్ సాధించాలన్న ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయ్యింది .