Ads
ముంబైలోని వాంఖడే స్టేడియంలో సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 187/4 స్కోర్ చేసింది. ధావన్ (88 నాటౌట్) చెలరేగగా.. రాజపక్స (42) తోడుగా ఉండడంతో పంజాబ్ భారీ స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో చెన్నై 176/6 స్కోరుకే పరిమితమైంది. అంబటి రాయుడు (78) ఒంటరిపోరాటం చేయగా.. మిగతా బ్యాటర్ లు రాణించలేకపోయారు.
Video Advertisement
దాంతో పంజాబ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన దావన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.188 పరుగుల టఫ్ టార్గెట్ చేజింగ్ లో చెన్నై పంజాబ్ బౌలర్లు తొలి ఓవర్ నుంచి కట్టడి చేశారు. ఓపెనర్ ఊతప్ప (1), మిచెల్ సాంట్నర్ (9), శివమ్ దూబే (8) క్రీజులో నిలువలేక పోయారు. అయితే 5వ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన అంబటిరాయుడు పంజాబ్ బౌలర్లపై ప్రతీకారం తీర్చుకున్నాడు.
ఫోర్లు, సిక్సర్లతో చెమటలు పట్టించాడు. మరో ఓపెనర్ రూతురాజ్ గైక్వాడ్ (30) రాయుడికి కాసేపు సహకరించాడు.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా తో కలిసి రాయుడు దూకుడు పెంచడంతో మ్యాచ్ సీఎస్కే వైపు తిరిగింది. 16వ ఓవర్ లో వరుసగా మూడు సిక్స్ లు,ఒక ఫోరుతో 23 పరుగులు పిండుకున్నాడు. అనంతరం రబాడ బౌలింగ్ లో రాయుడు (78) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ (12)ఆఖరి ఓవర్ లో అవుటయ్యాడు.
అయితే అప్పటికే బంతులు తక్కువగా ఉండి చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో సిఎస్కే మ్యాచ్ పై ఆశలు వదులుకుంది. జడేజా (21), ప్రిటోరియస్ (1)చివరి వరకు ఉన్నారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేసింది. రబాడ, రిషి ధావన్ చెరి రెండు వికెట్లు తీయగా.. సందీప్, అర్షదీప్ సింగ్ లకు తలా ఒక వికెట్ దక్కింది.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
End of Article