Ads
India vs Australia1st T20: విశాఖపట్నంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి T20 ఇంటర్నేషనల్‌లో భారత్ రెండు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కీలకమైన నాక్‌లు ఆడారు.
Video Advertisement
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఇన్‌గ్లి్‌స (50 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 110) శతకం, స్మిత్ (41 బంతుల్లో 8 ఫోర్లతో 52) అర్ధసెంచరీ సాధించారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీసారు. 209 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు ఓపెనర్ రుతురాజ్ (0) ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే తొలి ఓవర్లోనే రనౌట్ అయ్యాడు. జైస్వాల్ మూడో ఓవర్‌లో వరుసగా 4, 6 బాది తర్వాత అవుట్ అయ్యాడు.
63/2 స్కోరు దగ్గర నుండి కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 80), ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 58) పార్టనర్ షిప్ తో గెలుపు ఇండియా సొంతం అయ్యింది. చివరిలో కొంచెం ఒత్తిడికి గురయ్యి వరస వికెట్లు కోల్పోయినా రింకూ సింగ్ (14 బంతుల్లో 4 ఫోర్లతో 22 నాటౌట్) ఫినిషర్ పాత్ర పోషించి భారత్ ని గెలిపించాడు. దీంతో ఈ సిరీస్ లో బోణి కొట్టేసింది భారత్. ఆస్ట్రేలియా తరఫున భారత సంతతి లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా (2/47) రెండు వికెట్లు తీశాడు.
భారత్, ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 26 టీ20లు ఆడాయి. అందులో భారత్ 15, ఆస్ట్రేలియా 10 గెలిచాయి. ఒక మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం రాలేదు. ఈ జట్ల మధ్య గత 5 టీ20 మ్యాచ్‌ల్లో భారత్ 3, ఆస్ట్రేలియా 2 గెలిచాయి.
#1.
#2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
#11.
#12.
#13.
#14.
#16.
End of Article