“ఆ స్పిన్ పిచ్ ఏంటో…మ్యాచ్ రెండు రోజుల్లో అయిపోయింది”..IND vs ENG 3 వ టెస్ట్ పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్.!

“ఆ స్పిన్ పిచ్ ఏంటో…మ్యాచ్ రెండు రోజుల్లో అయిపోయింది”..IND vs ENG 3 వ టెస్ట్ పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

పింక్ టెస్ట్ లో రెండవ రోజు కొత్త రికార్డులు నెలకొల్పారు. గురువారం ఆట ఆరంభించిన టీమిండియాని జాక్‌ లీచ్ (4/54)‌, జో రూట్‌ (5/8) రెండు గంటల్లో ఆల్ అవుట్ చేశారు. 99/3 తో ఆట మొదలు పెట్టినప్పుడు భారత్ స్కోర్ చేయడం ఖాయం అని అనుకున్నారు. రోహిత్‌ (66; 96 బంతుల్లో 11×4), అజింక్య రహానె (7; 25 బంతుల్లో 1×4) టీమ్ ఇండియాకి ఆధిక్యం అందిస్తారని భావించారు. కానీ జో రూట్‌ స్పిన్‌ దెబ్బకు రెండవ రోజు భారత జట్టు 46 పరుగులకి 7 వికెట్లు చేజార్చుకొని 145 కి ఆలౌట్ అయ్యింది.

Video Advertisement

రెండవ రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు లో రోహిత్‌, రహానెని అవుట్ చేసి మొదటి దెబ్బ కొట్టారు జాక్‌ లీచ్. తర్వాత రిషభ్‌ పంత్‌ (1), అశ్విన్‌ (17), వాషింగ్టన్‌ సుందర్‌ (0), అక్షర్‌ పటేల్‌ (0), జస్ప్రీత్‌ బుమ్రా (1) అవుట్ అయ్యారు.అశ్విన్‌ కొంచెం సేపు ప్రయత్నించినా కూడా అవతల వైపు నుండి అశ్విన్ కి ఎటువంటి సహకారం లభించలేదు.అక్షర్ పటేల్‌ దూకుడుగా ఆడి ఒత్తిడి చేద్దాం అనుకుని విఫలం అయ్యారు. ఇషాంత్‌ శర్మ (10; 20 బంతుల్లో 1×6) స్కోర్ తో అజేయంగా నిలిచారు.

అక్షర్‌ పటేల్‌ (5/32), అశ్విన్‌ (4/48) ప్రత్యర్థిని 81 పరుగులకి అవుట్ చేశారు. ఓపెనర్‌ జాక్‌ క్రాలీ (0), జానీ బెయిర్‌ స్టో (0)ను అక్షర్‌ పటేల్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశారు. కొంచెం సేపు ఫ్రిజ్ లో నిలిచిన డొమినిక్‌ సిబ్లీ (7; 25 బంతుల్లో)ని పెవిలియన్ కి పంపించారు. ఇంగ్లాండ్‌ను కెప్టెన్‌ జో రూట్‌ (19)తో కలిసి బెన్‌స్టోక్స్‌ (25) జట్టుని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. జట్టు స్కోర్ 50 దగ్గర ఉన్నప్పుడు స్టోక్స్‌ ను అవుట్ చేయడం ద్వారా ఆ జోడిని విడదీశారు రవిచంద్రన్ అశ్విన్.

ఇంక 56 దగ్గర రూట్‌ను అవుట్ చేసి ఇ ఒక టెస్ట్ లో పది వికెట్ల ఘనతను సాధించారు. తర్వాత కొంచెం సేపటికి ఇంగ్లాండ్ స్కోర్ 66/6 దగ్గర ఉన్నప్పుడు ఒలీ పోప్‌ (12)ను యాష్‌ క్లీన్ ‌బౌల్డ్‌ చేశారు. జోఫ్రా ఆర్చర్‌ (0), జాక్‌ లీచ్‌ (9; 22 బంతుల్లో 1×6) ని పెవిలియన్ కి పంపించారు అశ్విన్.బెన్‌ఫోక్స్‌ (8; 28 బంతుల్లో)ని అవుట్ చేసి ఒక టెస్ట్ లో 11 వికెట్స్ ఘనతను సాధించారు అక్షర్.అండర్సన్‌ (0)ను సుందర్‌ అవుట్ చేశారు. 77 టెస్టులలో 400 వికెట్ల ఘనతను అందుకున్నారు అశ్విన్. ముత్తయ్య మురళీధరన్ తర్వాత అశ్విన్ ఆ మైలురాయిని చేరుకున్నారు. అయితే ఎంతో ఉత్కంఠ మ్యాచ్ పై సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15


End of Article

You may also like