Ads
హైదరాబాద్ విజయ పరంపరను కొనసాగిస్తోంది. ఓటములతో ప్రారంభించిన సన్ రైజర్స్ జట్టు మూడో మ్యాచ్ నుంచి వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు.చిన్న జట్టు, పెద్ద జట్టు అనే తేడా లేకుండా వచ్చిన వారికి వచ్చినట్టే ఓటమి రుచి చూపిస్తూ ముందుకు సాగుతోంది. టోర్నీ ప్రారంభంలో విమర్శలు ఎదుర్కొన్న కేన్ సేన పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. మొన్నటి వరకు హైదరాబాద్ ని తేలికగా తీసుకున్న వారికి నేడు
Video Advertisement
సింహస్వప్నంలా మారి జూలువిధిలిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు పై ఒక్కసారిగా అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు ఆ జట్టు ప్రదర్శనే కారణం. వరుసగా రెండు ఓటమిలు ఎదురైనా ఏమాత్రం కుంగిపోకుండా జట్టు కెప్టెన్ విలియమ్ సన్ సారథ్యంలో ఆరెంజ్ ఆర్మీ అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్
హెచ్ 2 ఓటములు, 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏకంగా రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ప్రత్యర్థులపై సన్ రైజర్స్ గెలిచిన మ్యాచ్ లు ఒక లెక్క.. శనివారం ఆర్సిబి తో జరిగిన మ్యాచ్ ఇంకో లెక్క.. టాస్ గెలిచి రాబాడ బౌలింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ బెంగుళూరు ను 16.3 ఓవర్లలో కేవలం 68 /10 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ 8 ఓవర్లలోనే 72/1 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
End of Article