Ads
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 15 లో ఇంగ్లాండ్ బ్యాటర్ జోస్ బట్లర్ శతకాల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే రెండు శతకాలు బాదిన బట్లర్ ఢిల్లీ క్యాపిటల్స్ పై శుక్రవారం మరో శతకాన్ని నమోదు చేశాడు. బట్లర్ (116), సెంచరీకి తోడు ఓపెనర్ పడిక్కల్ (54),సంజు (46) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరును చేసింది.
Video Advertisement
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు చివరి వరకు పోరాడి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 207 పరుగులే చేసి పరాజయం పాలైంది. దీంతో రాజస్థాన్ జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు.
ముఖ్యంగా బట్లర్-పడిక్కల్ కలిసి తొలి వికెట్ కు 15 ఓవర్లలో 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పడిక్కల్ 35 బంతులాడి 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. బట్లర్ 65 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు,9 భారీ సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేసి ముస్తాఫిజుర్ బౌలింగులో అవుటయ్యాడు.
ఆ తర్వాత కెప్టెన్ సంజు శాంసన్ 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్ లు చేయడంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్,రెహ్మాన్ కు తలా ఒక వికెట్ లభించాయి. ఛేదనలో ఢిల్లీ జట్టు పోరాడిన నిలకడగా ఆడే బ్యాటర్ కరువయ్యాడు.
పృథ్వీ షా (37), వార్నర్ (28), పంత్ (44), పావెల్ (36) మాత్రమే రాణించారు. ఢిల్లీ చివరి ఓవర్లో 36 పరుగులు చేయాల్సి రావడంతో దాదాపు పరాజయం ఖాయమైంది. ఆ ఓవర్లో 20 పరుగులే చేయడంతో 15 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమిపాలైంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బట్లర్ కు లభించింది.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
End of Article