మెరిసిన కోల్ కత్తా.. RR vs KKR మ్యాచ్ పై ట్రోల్స్..!!

మెరిసిన కోల్ కత్తా.. RR vs KKR మ్యాచ్ పై ట్రోల్స్..!!

by Sunku Sravan

Ads

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-15 లో క్వాలిఫైయర్ మ్యాచ్ ల దశ ముగింపు దశకు చేరుకుంటుండగా టోర్నీ రసవత్తరంగా మారుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 152 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Video Advertisement

ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ బ్యాటర్ లు సమష్టిగా రాణించడంతో 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 158 పరుగులు సాధించి అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.కేకేఆర్ జట్టులోనూ ఓపెనర్స్ చేతులెత్తేయడంతో మిడిలార్డర్ పైన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

కెప్టెన్ అయ్యర్ 34/32, నితీష్ రానా 48/37, రింకూ సింగ్ 42/23 సమష్టిగా రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ పై కేకేఆర్ విక్టరీ నల్లేరు మీద నడకైంది. ఒకానొక దశలో ఆర్ఆర్ విక్టరీ ఖాయమని అంతా అనుకున్నారు. ఆర్ఆర్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు పడుతున్న క్రమంలో నితీష్ రానా,రింకూ సింగ్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.

ఇద్దరూ చెలరేగి ఆడటంతో ఆర్ఆర్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ సునాయాసంగా చేధించింది. దీంతో వరుస ఓటములకు నైట్ రైడర్స్ జట్టు బ్రేక్ ఇచ్చి మరోసారి విజయాన్ని కైవసం చేసుకుంది .తాజా విక్టరీ తో అయ్యర్ సేన 4 విజయాలు, 6 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకింది.

#1

#2

#3

#4

#5

#6

#7

#8


End of Article

You may also like