BRAHMAMUDI: “బ్రహ్మముడి” సీరియల్ లో ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదుగా.? అనామికను వదిలేసి అప్పు కోసం కళ్యాణ్.!

BRAHMAMUDI: “బ్రహ్మముడి” సీరియల్ లో ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదుగా.? అనామికను వదిలేసి అప్పు కోసం కళ్యాణ్.!

by Harika

Ads

స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి టీఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. ఇక కథలోకి వస్తే ఒకవైపు ఉద్యోగం పోయింది, మరొకవైపు ప్రేమించిన కళ్యాణ్ ని పోగొట్టుకున్న అప్పు నిరాశతో రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఆక్సిడెంట్ అయిపోతుంది. దాంతో కంగారుపడిన కృష్ణమూర్తి దంపతులు కావ్యకి ఫోన్ చేస్తారు.

Video Advertisement

కావ్య ఇంట్లో చెప్తే పూజ ఆగిపోతుంది అనే ఉద్దేశంతో ఎవరికీ చెప్పకుండా భర్తకి మాత్రమే చెప్పి కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే పూజని వదిలేసి వెళ్ళినందుకు ధాన్యలక్ష్మితో సహా అందరూ కావ్యని నిందించడంతో రాజ్ అసలు నిజం చెప్తాడు. నిజమా అంటూ కళ్యాణ్ రియాక్ట్ అవుతాడు. అప్పుడే కావ్య భర్తకు ఫోన్ చేసి అప్పు కి సీరియస్ గా ఉంది రేర్ బ్లడ్ గ్రూప్ అంట దొరకటం లేదు అని చెప్తుంది.

అయితే రాజ్ దగ్గర ఫోన్ లాక్కున్న కళ్యాణ్ ఈ విషయం నాకెందుకు చెప్పలేదని కోప్పడి నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ నేను వస్తాను అంటూ కావ్య చెప్తున్నా ఇంట్లో వాళ్ళు చెప్తున్నా వినకుండా పూజ ఆపేసి అప్పు కోసం హాస్పిటల్ కి వెళ్లి అక్కడ బ్లడ్ చేస్తాడు. సమయానికి బ్లడ్ అందుకోవటంతో ప్రాణహాని నుంచి బయటపడుతుంది అప్పు. నా చెల్లెల్ని సేవ్ చేసినందుకు సంతోషించాలో అక్కడ భార్యని వదిలేసి వచ్చినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు అని బాధపడుతుంది కావ్య.

దేవుడు ఎక్కడికి పోడు.పూజ దేముంది వదిన మంచి రోజులు ముందు ముందు చాలా వస్తాయి కానీ నా ఫ్రెండు కష్టంలో ఉన్నప్పుడు నేను పక్కన లేకపోతే ఎలా అని కావ్యకి చెప్తాడు కళ్యాణ్. ఐసీయూ లో ఉన్న అప్పుని చూస్తూ త్వరగా లేచి రా బ్రో నన్ను తిట్టడానికైనా నువ్వు త్వరగా రావాలి లేదంటే నాకు ఏమీ తోచదు అని వేడుకుంటాడు కళ్యాణ్. అయితే రాజ్ ఇంట్లో మాత్రం ఇదంతా కావ్య స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది అనుకుంటారు. ఆపై ఏం జరుగుతుందనేది తెలియాల్సి ఉంది.

 


End of Article

You may also like